
వినియోగదారులకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన సేవలు అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఇప్పటికే ఇతర ఏ నేషనలైజ్డ్ బ్యాంకు అందివ్వని విధంగా పూర్తి భద్రత, భరోసాతో కూడిన ఆన్ లైన్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్, యాప్ ల సాయంతో సేవలను అందిస్తోంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా సకల సేవలను అరచేతిలోకి తీసుకొచ్చింది. యాప్ నుంచే ఎన్ఆర్ఐ లకు డిజిటల్ ఖాతాలను కూడా ప్రారంభించింది. ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ ఖాతాలను యోనో యాప్ ద్వారా ప్రారంభించే వెసులు బాటును తీసుకొచ్చింది. ఇప్పుడు అదే క్రమంలో వీడియో కేవైసీ ఆధారంగా అకౌంట్ ప్రారంభించే ఫీచర్ను ప్రకటించింది. ఈ ఫీచర్ సాయంతో వినియోగదారులు ఆన్ లైన్ లోనే ఎస్బీఐ ఖాతాను ఓపెన్ చేసే వెసులుబాటు దొరికింది. బ్రాంచ్ వద్దకు వెళ్లకుండానే యోనో యాప్ సాయంతోనే అకౌంట్ ఓపెన్ చేసేలా ఈ కొత్త ఫీచర్ ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలను ఎస్బీఐ అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. మీరు ఎప్పుడైనా.. ఎక్కడైనా ఎస్బీఐ బ్యాంక్ ఖాతాను ప్రారంభించవచ్చని, అందుకోసం కేవైసీ వీడియో ఫంక్షన్ తీసుకొచ్చినట్లు చెప్పింది. ఎస్బీఐ అందిస్తోన్న ఈ డిజిటల్ అకౌంట్ పేరు ఎస్బీఐ ఇన్ స్టా ప్లస్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
You may open a #SavingsAccount with us without going to the bank. You may create a savings account ANYTIME and ANYWHERE thanks to the brand-new KYC video function, which streamlines the procedure. Apply now on YONO!#SBI #KYC #DigitalSavingAccount #YONOSBI #AmritMahotsav pic.twitter.com/XlclpMFy0M
ఇవి కూడా చదవండి— State Bank of India (@TheOfficialSBI) September 3, 2022
Open a Saving account with a quick video KYC feature! It’s contactless, safe and secure, download the SBI YONO app and get started with your savings journey today!#SBI #SavingAccounts #KYC #DigitalSavingAccount #YONOSBI #AmritMahotsav pic.twitter.com/Psgzq3xwJk
— State Bank of India (@TheOfficialSBI) August 30, 2022
18 ఏళ్లు పైబడిన భారతీయ నివాసి అయిఉండాలి. తప్పనిసరిగా అక్షరాస్యుడై ఉండాలి.
కొత్త వినియోగదారులకు మాత్రమే ఈ ఖాతా ఓపెన్ అవుతుంది. ఇప్పటికే ఎస్బీఐలో ఖాతా కలిగి ఉన్న వారికి ఇది వర్తించదు. మోడ్ ఆఫ్ ఆపరేషన్ కేవలం సింగిల్.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..