దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆదివారం సెలవు దినాన్ని మరో రోజుకు మార్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ బ్రాంచ్‌లో ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. మహారాష్ట్రలోని గోవండి బ్రాంచ్ డిసెంబరు 1 నుంచి తమ ఉద్యోగులకు వీక్లీ ఆఫ్‌ని మార్చాలని నిర్ణయించింది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI ఆదివారం వారపు సెలవులో పెద్ద మార్పు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎస్‌బీఐకి చెందిన ఒక బ్రాంచ్‌లో వారంవారీ సెలవు ఆదివారం కాకుండా శుక్రవారం ఉంటుంది. SBI గోవండి శాఖ తన వారపు సెలవు దినాన్ని ఆదివారం కాకుండా శుక్రవారంగా మార్చింది.
ప్రతీ ఆదివారం వీక్లీ ఆఫ్ ని ఈ బ్రాంచ్‌లో శుక్రవారానికి మార్చారు. బ్యాంక్ బ్రాంచ్ పరిసర ప్రాంతాల్లో నివసించే మైనారిటీ కమ్యూనిటీ ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శాఖ ఈ నిర్ణయం తీసుకుంది ఎస్బీఐ. IANS అందించిన సమాచారం ప్రకారం, SBI గోవండి బ్రాంచ్ వెలుపల నోటీసు అతికించింది. బ్యాంకు శాఖలో సెలవును మార్చాలని స్థానికుల నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ బ్రాంచ్ పరిసర ప్రాంతాల్లో నివసించే మైనారిటీ వర్గాల ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం సంచలనంగా మారింది. అయితే, గోవండి బ్రాంచ్ తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయంపై సంప్రదించినప్పటికీ SBI అధికారి ఎవరూ ఏమీ చెప్పలేదు.
డిసెంబర్ 1 నుంచి ఆదివారం నుండి గురువారం వరకు.. రోజువారీ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పని వేళలు సాధారణంగా ఉంటాయని ఆ నోటీస్ లో పేర్కొంది. ప్రతీ శుక్రవారం సెలవు దినంగా ప్రకటించి.. ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలలో మూసివేయబడుతుందని తెలిపింది.
నోటీసు అతికించిన బ్యాంక్ వెలుపల పోస్ట్ చేసిన నోటీసు ప్రకారం, డిసెంబర్ 1, 2022 నుంచి SBI గోవండి బ్రాంచ్ అన్ని శుక్రవారాల్లో మూసివేయబడుతుంది. దీనితో పాటు, బ్యాంకు ఈ శాఖ ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలలో మూసివేయబడుతుంది. ఈ బ్యాంకు శాఖ ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాధారణంగా పని చేస్తుంది. అయితే.. గోవండి బ్రాంచ్ తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయంపై ఎస్బీఐ అధికారులు సంప్రదించకపోవడం గమనార్హం. అయితే ఈ నిర్ణయం ఆ స్థానిక ప్రజల అవసరాల మేరకు తీసుకున్నారా..? లేక ఆ స్థానిక ప్రజలే ఇలాంటి బోర్డును బ్రాంచ్ ముందు ప్రదర్శించారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం స్థానిక డిమాండ్ మేరకు ఎస్ బీఐ గోవండి శాఖ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో వీక్లీ ఆఫ్ లేదా పబ్లిక్ హాలిడే పట్టింపు లేదని బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులు విశ్వసిస్తున్నారు. ఎందుకంటే సెలవు ఉన్నప్పటికీ బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం