
చాలా మంది మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు చాలా వేగంగా రాబడి రావాలని కోరుకుంటారు. కానీ నిజంగా పెద్ద మొత్తంలో రాబడి రావాలంటే దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టడం ద్వారా వస్తాయి. అలా అద్భుతమైన రాబడి ఇచ్చిన ఓ మ్యూచువల్ ఫండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఒక పెట్టుబడిదారుడు 20 సంవత్సరాల క్రితం SBI ఫోకస్డ్ ఫండ్ నెలవారీ రూ.10,000 SIPని ప్రారంభించి ఉంటే, అదే పెట్టుబడి నేడు సుమారు రూ.1.54 కోట్ల కార్పస్‌కు పెరిగి ఉండేది. మార్కెట్ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని ఇది స్పష్టంగా సూచిస్తుంది.
SBI ఫోకస్డ్ ఫండ్ అతిపెద్ద బలం దాని స్థిరమైన పనితీరు. గత 3, 5, 10, 20 సంవత్సరాలలో ఈ ఫండ్ SIPల ద్వారా స్థిరంగా 16 శాతం కంటే ఎక్కువ వార్షిక రాబడిని అందించింది. ఇది అన్ని ప్రధాన కాలపరిమితులలో పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించే ఏకైక SBI ఫండ్‌గా నిలిచింది. ఈ ఫండ్ వివిధ కాలపరిమితులలో పెట్టుబడిదారులకు విభిన్న రాబడిని అందించింది. ఉదాహరణకు 3 సంవత్సరాల SIP 18.56 శాతం CAGRను, 5 సంవత్సరాల SIP 16.04 శాతం CAGRను, 10 సంవత్సరాల SIP 16.09 శాతం CAGRను అందించింది. ఇంకా 20 సంవత్సరాల రాబడి విషయానికి వస్తే ఇది పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించింది. ఈ ఫండ్ కేవలం SIPలలోనే కాకుండా ఒకేసారి పెట్టుబడులు పెట్టడంలో కూడా బలమైన ట్రాక్ రికార్డ్ కలిగి ఉంది.
SBI ఫోకస్డ్ ఫండ్ ఒక ప్రత్యేకమైన పెట్టుబడి వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఇది గరిష్టంగా 30 కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది. ఫండ్ మేనేజర్ అత్యధిక విశ్వాసం కలిగి ఉన్న స్టాక్‌లను మాత్రమే ఎంచుకుంటుంది. ఈ ఫండ్ ఎల్లప్పుడూ తన నిధులలో కనీసం 65 శాతం స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతుంది. అవసరమైన విధంగా లార్జ్, మిడ్, స్మాల్-క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి పెడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి