Fixed Deposit Schemes: ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మంచి ఆదరణ ఉంది. డబ్బులున్నవారు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధికంగా మొగ్గు చూపుతుంటారు. ఇక బ్యాంకులు, పోస్టాఫీసులలో ఫిక్స్‌డ్‌లకు వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఇక పోస్ట్ ఆఫీసులు ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల వరకు టర్మ్ డిపాజిట్లను అందిస్తాయి. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే పెట్టుబడిదారులు పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ కాల వ్యవధిలో హామీతో కూడిన రాబడిని పొందుతారు. మూడు సంవత్సరాల వరకు ఒక సంవత్సరం కాల డిపాజిట్ కోసం ఇది 5.5% వడ్డీ రేటును అందిస్తుంది. పోస్టాఫీసు ఐదు సంవత్సరాల కాల పరిమితి డిపాజిట్లకు 6.7% వడ్డీ రేటును అందిస్తుంది.
పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లు:
1 సంవత్సరం – 5.5 శాతం
2 సంవత్సరాలు – 5.5 శాతం
3 సంవత్సరాలు – 5.5 శాతం
5 సంవత్సరాలు – 6.7 శాతం
ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD):
ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లను 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు కాలపరిమితిని ఎంచుకోవచ్చు. ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు సాధారణ కస్టమర్లకు 2.9 శాతం నుంచి 5.4 శాతం మధ్య ఉంటుంది. కరోనా మమహ్మారి సమయంలో ఎస్బీఐ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో తగ్గుతున్న రేట్ల మధ్య, SBI సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక FD పథకాన్ని ప్రారంభించింది -వీ కేర్ – ఇది సీనియర్ సిటిజన్‌లకు వారి FDపై 5 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ కాల వ్యవధిలో వడ్డీ రేటుతో పాటు అదనంగా 30 బేసిక్ పాయింట్స్ అందిస్తోంది.
ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తాగా వడ్డీ రేట్లు (రూ.2 కోట్ల లోపు):
7 రోజుల నుండి 45 రోజుల వరకు – 2.9 శాతం
46 రోజుల నుండి 179 రోజులు – 3.9 శాతం
180 రోజుల నుండి 210 రోజులు – 4.4శాతం
211 రోజుల నుండి 1 సంవత్సరం – 4.4శాతం
1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల లోపువ – 5 శాతం
2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ – 5.1 శాతం
3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల లోపు – 5.3 శాతం
5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు – 5.4శాతం
ఇవి కూడా చదవండి: