SBI Cashback Offer : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వారాంతంలో కొవిడ్ నిబంధనల వల్ల ఇబ్బందిపడుతున్న వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తోంది. ఈ వారాంతంలో పచారీ, గృహ అవసరాల కొనుగోలుపై ఎస్బీఐ కస్టమర్లకు తగ్గింపు అందిస్తోంది. కిరాణ సమానుపై స్పెన్సర్‌లో వినియోగదారలకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. స్పెన్సర్‌లో పొదుపుతో మీ రోజు ప్రారంభించండి..ఎస్బీఐ కార్డుతో స్పెన్సర్‌లో 5 శాతం క్యాష్ బ్యాక్ పొందండి అంటూ ట్వీట్ చేసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు ఏప్రిల్ 11 రాత్రి వరకు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఆదివారం స్పెన్సర్‌లో కిరాణ, గృహ అవసరాలను కొనుగోలు చేయడానికి. ఎస్బీఐ కస్టమర్లకు ఒక్కో కార్డుపై గరిష్టంగా రూ.500 తగ్గింపు అందిస్తోంది. ఎస్బీఐ ఆఫర్ ప్రకారం కనీస లావాదేవీ 2000 రూపాయలు ఉండాలి. ఎస్బీఐ ఆఫర్ స్పెన్సర్ స్టోర్స్, వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్‌లో లభిస్తోంది. ఎస్బీఐ కస్టమర్లు తమ సమీప స్పెన్సర్ దుకాణాన్ని సందర్శించడం ద్వారా కూడా ఆఫర్ పొందవచ్చు. ఎస్బీఐ కస్టమర్లు www.spencers.in మరియు స్పెన్సర్ మొబైల్ అనువర్తనాన్ని కూడా సందర్శించవచ్చు. స్టోర్, వెబ్‌సైట్ & అనువర్తనం అంతటా చేసిన లావాదేవీల కోసం క్యాష్‌బ్యాక్ క్యాప్ చేయాలి. అర్హతగల లావాదేవీల కోసం క్యాష్‌బ్యాక్ జూలై 10, 2021 న పోస్ట్ చేయబడుతుంది.
ఇదిలా ఉంటే.. ఎస్బీఐ తమ ఖాతాదారుల కోసం అనేక రకాలైన డిపాజిట్ స్కీమ్ లు అందుబాటులోక తీసుకొచ్చింది. ఇవి ప్రభుత్వ విధానాలను అనుసరించి ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఈ ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన సందర్భంగా ఎస్బీఐ లలో డిపాజిట్ లపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. జనవరి 8, 2021 నుంచి ఎస్బీఐలో అమలులో ఉన్న వడ్డీ రేట్ల ప్రకారం..
46 రోజుల వ్యవధి నుంచి 179 రోజుల వ్యవధి ఉన్న టర్మ్ డిపాజిట్లపై 3.9% వడ్డీ లభిస్తుంది.
ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల కంటే తక్కువ సమయానికి డిపాజిట్ చేస్తే 5% వడ్డీ రేటు ఎస్బీఐ ఆఫర్ చేస్తోంది.
రెండేళ్లకు పైబడి మూడేళ్ళ లోపు డిపాజిట్లపై 5.1% వడ్డీరేటు ఎస్బీఐ ఇస్తోంది.
మూడేళ్లకు మించి ఐదేళ్ల లోపు టర్మ్ డిపాజిట్లపై ఎస్బీఐ లో 5.3% వడ్డీరేటు దొరుకుతుంది.
ఇక ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు డిపాజిట్ చేస్తే ఎస్బీఐ 5.4% వడ్డీరేటు ఇస్తుంది.