ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఖాతాదారులకు ముఖ్యమైన అలెర్ట్. ఆగష్టు 6,7 తేదీల్లో కొద్ది గంటల పాటు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. కస్టమర్లకు ఎప్పుడూ మెరుగైన, సులభతరమైన సేవలను అందించడంలో బ్యాంకు ప్రాధాన్యతను ఇస్తుంది. ఇందులో భాగంగా మెయింటెనెన్స్ సేవల నిమిత్తం శుక్రవారం, శనివారం డిజిటల్ బ్యాంకింగ్ సేవల్లో కొన్ని గంటల పాటు అంతరాయం కలుగుతుంది.
ఆగష్టు 6వ తేదీ రాత్రి 10.45 గంటల నుంచి ఆగష్టు 7వ తేదీ తెల్లారుజామున 1.15 గంటల వరకు ఎస్బీఐ ఇంటర్నెట్ సేవలు పని చేయవు. యోనో, యోనో లైట్, ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో బిజినెస్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో సమస్యలు తలెత్తుతాయని ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. కస్టమర్లు ఇది గుర్తించి తమకు సహకరించాలని కోరింది.
మరోవైపు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌ల కొత్త వెర్షన్స్ కస్టమర్లు వివిధ డిజిటల్ ఫ్రాడ్స్ నుంచి రక్షిస్తుందని పేర్కొంది. యోనో, యోనో లైట్ అప్లికేషన్స్‌లో కొత్తగా తీసుకొచ్చే ‘సిమ్ బిండింగ్’.. కేవలం బ్యాంకు అకౌంట్లతో అనుసంధానం ఉన్న మొబైల్ నెంబర్ డివైస్‌లలో మాత్రం పని చేస్తుందని ఎస్బీఐ తెలిపింది. వీటిని వినియోగించుకునేందుకు యూజర్లు యాప్‌ను అప్‌డేట్ చేసుకోవడంతో పాటు వన్-టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను సైతం పూర్తి చేయాలని చెప్పింది.
We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/yO7UDdXuEG
— State Bank of India (@TheOfficialSBI) August 4, 2021