Banking: ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జ్యూమర్ బ్యాంకు ఇదే.. గ్లోబల్ ఫైనాన్స్ అవార్డుకు ఎంపిక

భారతదేశపు అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని దక్కించుకుంది. 2025 సంవత్సరానికి గాను 'ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జూమర్ బ్యాంక్'‌గా ఎస్‌బీఐని ఎంపిక చేసినట్లు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రకటించింది. ఎడిటోరియల్ విశ్లేషణలు, అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ నిపుణుల అభిప్రాయాల ఆధారంగా 150కి పైగా దేశాలకు చెందిన సంస్థలను ఈ పురస్కారం కోసం ఎంపిక చేస్తారు.

Banking: ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జ్యూమర్ బ్యాంకు ఇదే.. గ్లోబల్ ఫైనాన్స్ అవార్డుకు ఎంపిక
Sbi The Global Bank

Updated on: Jul 20, 2025 | 9:43 PM

భారతదేశపు అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025 సంవత్సరానికి గాను ‘ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జూమర్ బ్యాంక్’ అవార్డును గెలుచుకుంది. ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఈ మేరకు ప్రకటించింది. విశ్లేషణ, ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ ఫైనాన్స్ నిపుణులు, విశ్లేషకులు, బ్యాంకర్ల అభిప్రాయాల ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ తన వార్షిక ‘వరల్డ్స్ బెస్ట్ బ్యాంక్’ కార్యక్రమంలో భాగంగా, ఐఎంఎఫ్/ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల సందర్భంగా 2025 అక్టోబర్ 18న వాషింగ్టన్ డీసీలో ఈ అవార్డును ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టికి ప్రదానం చేయనున్నారు.

అదే మా లక్ష్యం..

ఈ సందర్భంగా ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి మాట్లాడుతూ.. తమ విలువైన ఖాతాదారులకు, అంకితభావంతో పనిచేసే ఉద్యోగులకు, నమ్మకం ఉంచిన భాగస్వాములందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వినియోగదారులకు మెరుగైన అనుభూతిని అందించడమే తమ వృద్ధి వ్యూహానికి కీలకమని ఆయన పేర్కొన్నారు. ఆన్-బోర్డింగ్‌ను సరళీకరించడం, ప్రాంతీయ భాషల్లో వాయిస్ బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టడం, 24/7 డిజిటల్ సపోర్ట్ అందించడం వంటి చర్యలతో గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని వినియోగదారులకు మరింత నిరాటంకమైన, సమ్మిళితమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమన్నారు. అలాగే, ఏఐ (AI) సామర్థ్యాలతో హైపర్-పర్సనలైజ్డ్ సేవలను అందిస్తూ, ఆమ్ని ఛానల్ ఎంగేజ్‌మెంట్ మోడళ్లను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మ్యాగజైన్ ‘గ్లోబల్ ఫైనాన్స్’ నాలుగు దశాబ్దాలుగా ఈ అవార్డులు అందజేస్తోంది. ఎడిటోరియల్ విశ్లేషణలు, అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ నిపుణుల అభిప్రాయాల ఆధారంగా 150కి పైగా దేశాలకు చెందిన సంస్థలను ఈ పురస్కారం కోసం ఎంపిక చేస్తారు.