SBI Alert: ఇవాళే మీ బ్యాంక్ వర్క్స్ కంప్లీట్ చేసుకోండి.. లేదంటే ఇబ్బందులు తప్పవ్..

|

Jan 27, 2023 | 7:25 AM

దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ కలిగిన ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్‌బిఐ లో కోట్లాది మంది ఖాతాదారులు అకౌంట్స్ కలిగి ఉన్నారు. మరి ఇంతమంది అకౌంట్ హోల్డర్..

SBI Alert: ఇవాళే మీ బ్యాంక్ వర్క్స్ కంప్లీట్ చేసుకోండి.. లేదంటే ఇబ్బందులు తప్పవ్..
Sbi
Follow us on

దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ కలిగిన ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్‌బిఐ లో కోట్లాది మంది ఖాతాదారులు అకౌంట్స్ కలిగి ఉన్నారు. మరి ఇంతమంది అకౌంట్ హోల్డర్ కలిగిన ఉన్న బ్యాంక్.. తన కస్టమర్లకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. వెంటనే అలర్ట్ అయి.. ఏవైనా బ్యాంక్ పనులు ఉంటే ఇప్పుడే కంప్లీట్ చేసుకోవాలని సూచించింది. లేదంటే.. రెండు రోజులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది ఎస్‌బిఐ.

జనవరి 30, 31 తేదీల్లో దేశ వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లు మూసివేయడం జరుగుతుంది. ఇక జనవరి 28, 29 తేదీలు వారాంతపు సెలవులు కావడంతో బ్యాంక్ తిరిగి ఫిబ్రవరి 1నే ప్రారంభమవుతాయి. ఇందుకు సంబంధించి ఎస్‌బిఐ ఒక ప్రకటన జారీచేసింది. జనవరి 30, 31 తేదీల్లో దేశ వ్యాప్తంగా సమ్మె చేపడుతుండటంలో సెలవులు ఉన్నాయి.

కావున, అత్యవసర బ్యాంక్ సేవలు ఉంటే.. ఇవాళే పూర్తి చేసుకోండి. లేదంటే మరో నాలుగు రోజుల పాటు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదిలాఉంటే.. నాలుగు రోజుల పాటు బ్యాంక్ సెలవులు ఉండటంతో బ్యాంక్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అయితే, బ్రాంచ్‌ల రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది.

యూనియన్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మంగళవారం (UFBU) రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెను ప్రకటించింది. అందువల్ల, బ్యాంకు శాఖలలో సాధారణ వ్యాపార కార్యకలాపాలు బంద్ అవుతాయి. పెన్షన్లను నవీకరించడం, నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ను రద్దు చేయడం, వేతనాన్ని మార్చడం, అన్ని క్యాడర్‌లకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహించడం వంటి డిమాండ్స్ చేస్తున్నారు ఉద్యోగులు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..