
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లిన వాళ్లు ప్రశాంతంగా తిరిగి హైదరాబాద్ నగరానికి వచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం – చర్లపల్లి – విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్ల వివరాలు వెల్లడించింది.
ఈ ప్రత్యేక రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైలులో 2AC, 3AC స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ప్రయోగాత్మక స్టాపింగ్ ఏర్పాటుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రైలు నంబర్ 12626/12625 న్యూఢిల్లీ– తిరువనంతపురం సెంట్రల్ – న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్ రైల్వే స్టేషన్ జనవరి 17, 2026 నుండి అమలులోకి వస్తుంది. రైలు నంబర్ 12626 / 12625 న్యూఢిల్లీ – తిరువనంతపురం సెంట్రల్ – న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్ సిర్పూర్ కాగజ్‌నగర్‌లో రాక / బయలుదేరే సమయాలు 17.01.2026 నుండి అమలులోకి వస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి