
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్ సంగ్ తన స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 23 సంచలనం సృష్టించిందని తెలిపింది. ప్రీ బుకింగ్స్ మొదలుపెట్టిన మొదటి 24 గంటల్లో రూ.1400 కోట్ల విలువైన ఫోన్లను కస్టమర్లు బుక్ చేసుకున్నారని పేర్కొంది. శామ్ సంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లాన్ ఇటీవల పీటీఐతో మాట్లాడారు. సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 23 గత వెర్షన్ తో పోలిస్తే ఏకంగా రెండు రెట్ల ఎక్కువని వివరించారు. కేవలం 24 గంటల్లో రూ.1400 కోట్ల విలువైన బుకింగ్స్ నమోదు చేయడం అంటే ఓ చరిత్ర అని పేర్కొన్నారు. అయితే ఫిబ్రవరి 23 వరకూ ప్రీ బుకింగ్స్ కొనసాగుతాయని తెలిపారు. భారత్ లో గెలాక్సీ ఎస్ 23 ధర రూ.75 వేల నుంచి రూ.1.5 లక్షల వరకూ ఉంది.
గెలాక్సీ ఎస్ 23 నోయిడాలో తయారు చేయనున్నారు. పాత గెలాక్సీ ఎస్ సిరీస్ అన్ని వియత్నాంలో తయారు చేసి భారత్ లో దిగుమతి చేసుకునే వారు. అయితే ఇటీవల కెమెరా లెన్స్ దిగుమతిపై సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో నోయిడాలో గెలాక్సీ ఎస్ 23 తయారుచేయనున్నారు. 200 ఎంపీ నుంచి 12 ఎంపీ కెమెరాలు 5 సెట్స్ కింద ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. సామ్ సంగ్ ఎస్ 22 అల్ట్రా సిరీస్ తో పోలిస్తే ఎస్ 23 ధర 2.7 శాతం నుంచి 30 శాతం వరకూ ఎక్కువ. అయితే ఫోన్ లోని కెమెరా సెన్సార్లు, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ వల్ల ఇది ఎక్కువగా వినియోగదారుల మనస్సును గెలుచుకుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..