Samsung Mobile:మొబైల్ ఫోన్ మార్కెట్లో ఏస్ బ్రాండ్‌గా ఉన్న సామ్‌సంగ్ కొత్త మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. మరోసారి ఫోల్డబుల్, ఫ్లిప్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టులో సామ్‌సంగ్ ఫ్లిప్, సామ్‌సంగ్ ఫోల్డ్‌లో కొత్త మోడల్స్ విడుదల చేయనుంది. గడిచిన రెండేళ్లుగా ఫోన్ ఫీచర్లలో పెద్ద మార్పులు లేవు. ప్రాసెసర్, కెమెరా పిక్సెల్, డిస్‌ప్లే విషయంలో దాదాపుగా ఒకే తరహా మొబైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. పైగా కంపెనీలు పోటీ పడి డిస్‌ప్లే, ర్యాస్, ఇంటర్నల్ సైజులు పెంచుకుంటూ పోయాయి. చేతిలో ఫోన్లు ఇమిడే పరిస్థితి ఇప్పుడు లేదు. రానురాను పెద్దగా ఉండే ఫోన్‌లో వస్తున్నాయి. దీంతో క్రమంగా చేతిలో ఇమిడిపోయే ఫోన్లను వినియోగదారులకు అందుబాటులో తీసుకురావాలని సమ్‌సంగ్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే సామ్‌సంగ్ జెడ్ ఫోల్డ్ 3, సామ్‌సంగ్ జడ్ ఫ్లిప్ 3 మోడళ్లు మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు మొదటి వారంలో విడుదల ఈవెంట్ జరిపి. మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలో ఓ భాగంగా ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
రెండు సంవత్సరాల కిందట సామ్‌సంగ్ జడ్ ఫోల్డ్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే దీని ధర లక్షకు పైగా ఉండటంతో ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగలేదు. దీంతో మొబైల్ వీడియో కంటెంట్‌కు ఇబ్బంది రాకుండా చేతిలో ఇమిడి పోయే ఫోల్డ్, ఫ్లిప్‌కు మార్కెట్ ఉంటుందని సామ్‌సంగ్ బలంగా నమ్ముతోంది. అయితే ధర ఈ మోడళ్ల అమ్మకాకలు అడ్డంకిగా మారిన ప్రైస్ బ్యారియర్‌ని తొలగించే పనిలో ఉంది సామ్‌సంగ్. అందులో భాగంగా రాబోయే కొత్త మోడళ్లు 20 శాతం తగ్గింపు ధరతో తెచ్చే అవకాశం ఉందని టెక్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.