Multibagger stocks: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ. 2.25 లక్షల రాబడి.. భారీ రిటర్న్స్ ఇస్తున్న మల్టీబ్యాగర్‌ స్టాక్..

|

Feb 26, 2022 | 10:13 AM

Multibagger stocks: పెన్నీ స్టాక్‌లో పెట్టుబడి పెట్టడం చాలా ప్రమాదకరం. అయితే అధిక రిస్క్ తీసుకోవాలనుకునే..

Multibagger stocks: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ. 2.25 లక్షల రాబడి.. భారీ రిటర్న్స్ ఇస్తున్న మల్టీబ్యాగర్‌ స్టాక్..
Stock Market
Follow us on

Multibagger stocks: పెన్నీ స్టాక్‌లో పెట్టుబడి పెట్టడం చాలా ప్రమాదకరం. అయితే అధిక రిస్క్ తీసుకోవాలనుకునే పెట్టుబడిదారులు ఇలాంటి స్టాక్‌ల్లో పెట్టుబడి పెడతారు. ఎందుకంటే ఇది దీర్ఘకాలికంగా దాని వాటాదారులకు భారీ రాబడిని ఇస్తుంది. స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం అంటే వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లే అని చెబుతున్నారు. ఇలాంటి స్టాక్‌ల్లో SRF ఒకటి. ఇది 2021లో మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఒకటి, ఈ కెమికల్ స్టాక్ దాని వాటాదారులకు అద్భుతమైన రాబడిని అందించింది. గత 20 సంవత్సరాలలో SRF షేరు ధర రూ.3.71 (22 ఫిబ్రవరి 2002న NSEలో ముగింపు ధర) నుంచి శుక్రవారం నాటికి రూ. 2424.50కి పెరిగింది. ఈ సమయంలో దాదాపు 65,250 శాతం పెరిగింది.

గత ఒక నెలలో, SRF షేర్ ధర దాదాపు రూ. 2349 నుంచి రూ. 2424 వరకు పెరిగింది. ఈ కాలంలో దాదాపు 3.5 శాతం పెరిగింది. గత 6 నెలల్లో, SRF షేర్లు దాదాపు రూ.1812 నుంచి రూ.2424 వరకు చేరుకున్నాయి. ఈ కాలంలో దాదాపు 35 శాతం వరకు పెరిగాయి. గత ఒక సంవత్సరంలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ దాదాపు రూ.1090 నుంచి రూ.2424కి పెరిగింది. ఈ సమయంలో దాదాపు 125 శాతం పెరిగింది. గత 5 సంవత్సరాలలో ఈ మల్టీబ్యాగర్ కెమికల్ స్టాక్ దాదాపు రూ.315 నుంచి రూ.2424 పెరిగింది. గత ఒక దశాబ్దంలో SRF షేరు ధర రూ.54.54 స్థాయిల నుంచి (NSEలో ఫిబ్రవరి 25న ముగింపు ధర) నేడు రూ. 2424.50 పెరిగింది.

ఒక ఇన్వెస్టర్ ఒక నెల క్రితం ఈ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ రూ. 1.03 లక్షలు ఉండేది. 6 నెలల కింద లక్ష పెడితే ఇప్పుడు రూ. 1.35 లక్షలకు చేరేది. సంవత్సరం క్రితం లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే, దాని విలువ ఇప్పుడు 2.25 లక్షలు అవుతుంది. 5 సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే దాని విలువ ఇప్పుడు 7.75 లక్షలకు చేరేది. ఒక ఇన్వెస్టర్ 10 సంవత్సరాల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో లక్ష పెట్టుబడి పెడితే దాని విలువ నేడు రూ. 44.50 లక్షలకు చేరి ఉండేది.

గమనిక: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పూర్తిగా నష్టభయంతో కూడుకున్నది. మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ని గుర్తించడానికి చాలా నైపుణ్యం కావాలి. పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం.

Read Also.. Gold: బంగారం కొనే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి.. లేకుంటే మోసపోతారు..