Rs 2000 Notes: రూ. 2000 నోట్లను మార్చుకునేందుకు ఆందోళన చెందుతున్నారా.. నో టెన్షన్.. ఇప్పడు ఇలా ఈజీగా మార్చుకోండి..

|

May 23, 2023 | 4:26 PM

రూ. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గత వారం ప్రకటించింది. నోట్‌లు చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతుండగా.. వాటిని సెప్టెంబరు 30లోపు బ్యాంకుల ద్వారా మార్చుకోవాలని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. మీరు ఇప్పటికే ఉన్న నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలకు లోబడి ఉంటే.. మీరు డిపాజిట్ చేయగల మొత్తానికి ఎటువంటి పరిమితులు లేవు.

Rs 2000 Notes: రూ. 2000 నోట్లను మార్చుకునేందుకు ఆందోళన చెందుతున్నారా.. నో టెన్షన్.. ఇప్పడు ఇలా ఈజీగా మార్చుకోండి..
Rs 2000 Notes
Follow us on

రూ. 2000 డినామినేషన్ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. 2000 రూపాయల నోట్లను సెప్టెంబర్ 30 లోగా మార్చుకోవాలని లేదా బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఆర్బీఐ  తెలిపింది. 2016 నోట్ బ్యాన్ నేపథ్యంలో చాలా మంది ఆందోళన చెందారు. దీనికి ఊతం ఇచ్చేలా సెప్టెంబరు 30 తర్వాత రూ .2000 నోటు చెల్లదని సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు షేర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.2000 నోటు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దీని ప్రకారం, సెప్టెంబరు 30 తర్వాత కూడా నోట్ చట్టబద్ధంగా కొనసాగుతుందని పేర్కొంది.

అయితే, రూ. 2,000 నోట్లను మార్చుకోవడానికి అన్ని బ్యాంకులు ఒకేసారి రూ. 20,000 పరిమితి వరకు మార్చుకునే వెసులుబాటు కల్పిస్తాయని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ప్రజలకు అసౌకర్యాన్ని తగ్గించడానికి, సజావుగా కార్యకలాపాలు సాగించేందుకు, బ్యాంకు శాఖల సాధారణ పనితీరుకు అంతరాయం కలగకుండా ఈ పరిమితి సెట్ చేయబడింది.

బ్యాంకులో రూ. 2000 నోట్లను ఎలా మార్చుకోవాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం..

స్టెప్ 1: మీ బ్యాంకుకు వెళ్లండి..

మీరు మీ రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి మార్చి 23 నుంచి ఏదైనా బ్యాంక్ సమీపంలోని శాఖకు వెళ్లండి. మీకు ఆ బ్యాంక్ లేదా బ్రాంచ్‌లో ఖాతా ఉన్నట్లయితే.. పని చాాలా ఈజీగా ముగించుకునేందుకు మీ ఖాతా వివరాలను అందించండి.

స్టెప్ 2: ‘రిక్వెస్ట్ స్లిప్’ని పూరించండి

మీ రూ. 2000 నోట్ల మార్పిడిని పూర్తి చేయడానికి బ్యాంక్ మీకు రిక్వెస్ట్ స్లిప్‌ను అందిస్తుంది. కింది సమాచారంతో స్లిప్‌ను పూరించండి.

– మీ పేరును పెద్ద అక్షరాలతో ‘టెండరర్’ అని వ్రాయండి.

– మార్పిడి సమయంలో మీరు సమర్పించాల్సిన ఆమోదించబడిన గుర్తింపు రుజువు నుంచి మీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించండి.

– మీరు సమర్పించే రూ. 2000 నోటు(లు) డినామినేషన్, నోట్ల సంఖ్య, మొత్తం విలువతో సహా (ఒకేసారి గరిష్ట పరిమితి ₹20,000 వరకు) వివరాలను పూరించండి.

– ఫారమ్‌పై సంతకం చేయండి. మార్పిడి స్థలం, తేదీని పేర్కొనండి.

స్టెప్ 3: ఫారమ్‌ను సమర్పించండి

మీరు అభ్యర్థన స్లిప్‌ను పూరించిన తర్వాత, మార్పిడిని పూర్తి చేయడానికి మీ రూ. 2000 నోట్లతో పాటు సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్‌లో సమర్పించండి.

మార్పిడి/డిపాజిట్ పరిమితులు:

మీరు రూ.2000 నోట్లను ఒకేసారి రూ.20,000 పరిమితి వరకు మార్చుకోవచ్చు. డిపాజిట్ల కోసం, నో యువర్ కస్టమర్ (KYC) నిబంధనలు, ఇతర అవసరాలకు లోబడి మీరు డిపాజిట్ చేయగల రూ. 2000 నోట్లపై ఎలాంటి పరిమితులు లేవు.

మార్పిడి/డిపాజిట్ తేదీలు:

మే 23 నుంచి వ్యక్తులు తమ రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి బ్యాంకులను సంప్రదించవచ్చు. ఈ ప్రక్రియకు చివరి తేదీ సెప్టెంబర్ 30.

మార్పిడి/డిపాజిట్ ఫీజు:

రూ. 2000 నోట్ల మార్పిడి సదుపాయాన్ని ఉచితంగా అందించనున్నారు.

ఖాతా లేనివారి కోసం మార్పిడి:

మీకు బ్యాంక్‌లో ఖాతా లేకపోయినా.. మీరు ఏ బ్యాంక్ బ్రాంచ్‌లోనైనా ఒకేసారి రూ. 2000 నోట్లను రూ. 20,000 పరిమితి వరకు మార్చుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం