Multibagger stocks: రూ.50 వేలు పెట్టుబడి పెడితే రూ.12 లక్షలు అయ్యాయి.. అదీ సంవత్సరంలోనే..

|

Dec 29, 2021 | 7:55 AM

కరోనా మహమ్మారితో ప్రపంచం అల్లాడుతున్నప్పటికీ, భారతీయ ఈక్విటీ మార్కెట్ 2021లో మంచి సంఖ్యలో మల్టీబ్యాగర్ స్టాక్‌లను అందించింది...

Multibagger stocks: రూ.50 వేలు పెట్టుబడి పెడితే రూ.12 లక్షలు అయ్యాయి.. అదీ సంవత్సరంలోనే..
Stock Market
Follow us on

కరోనా మహమ్మారితో ప్రపంచం అల్లాడుతున్నప్పటికీ, భారతీయ ఈక్విటీ మార్కెట్ 2021లో మంచి సంఖ్యలో మల్టీబ్యాగర్ స్టాక్‌లను అందించింది. ఆసక్తికరంగా మల్టీబ్యాగర్ స్టాక్‌ల జాబితాలో కొన్ని పెన్నీ స్టాక్‎లు కూడా ఉన్నాయి. అందులో Tata Teleservices ఒక్కటి. ఇది ఈ షేరు రూ.2.75 నుంచి రూ.178.30కి పెరిగింది. దాదాపు ఒక సంవత్సరం కాలంలో దాదాపు 65 శాతం పెరిగింది.

గత వారంలో ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ దాదాపు రూ.162 నుంచి రూ.178.30కి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 10 శాతం పెరిగింది. గత నెలలో టాటా టెలిసర్వీసెస్ షేరు ధర రూ. 107.20 నుంచి రూ.178.30 వరకు పెరిగింది. ఈ కాలంలో దాదాపు 66 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అదేవిధంగా గత 6 నెలల్లో Tata Teleservices షేర్ రూ.40.50 నుంచి రూ.178.30 వరకు పెరిగింది. అంటే 340 శాతం పెరిగింది. గత సంవత్సరంలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ఒక్కో షేరు రూ. 7.85 నుంచి రూ.178.30కి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 2200 శాతం పెరిగింది. అయితే 16 అక్టోబర్ 2020న ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ముగింపు ధరను పరిశీలిస్తే, ఈ పెన్నీ స్టాక్ సంవత్సరన్నర కాలంలో దాదాపు 6400 శాతం వృద్ధితో రూ. 2.75 నుంచి రూ.178.30కి పెరిగింది.

Tata Teleservices షేర్ ధర పరిశీలిస్తే, ఒక పెట్టుబడిదారుడు ఒక వారం క్రితం ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో రూ. లక్ష ఇన్వెస్ట్ చేస్తే దాని విలువ రూ.1.10 లక్షలకు చేరుతుంది. ఒక పెట్టుబడిదారుడు ఒక నెల క్రితం ఈ పెన్నీ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే దాని విలువ రూ. 1.66 లక్షలకు చేరుకుంది. ఒక పెట్టుబడిదారుడు 6 నెలల క్రితం టాటా టెలిసర్వీసెస్ షేర్‌లలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని విలువ ఇప్పుడు 4.40 లక్షలకు చేరి ఉండేది. ఒక పెట్టుబడిదారుడు సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఈ పెన్నీ స్టాక్‌లో లక్ష పెట్టుబడి పెడిచే రోజుకు ఆ పెట్టుబడి విలువ రూ. 23 లక్షలకు చేరేది.

Read Also..  Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..