Ambani vs Adani: భారత వ్యాపార బిలియనీర్లు(Indian Billionaires) ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల మధ్య వ్యాపార విస్తరణ పోరు మరింత తీవ్రం కానుంది. వీరి మధ్య రోజురోజుకీ పెరుగుతున్న పోటీ దేశ వ్యాపార ముఖచిత్రాన్ని మార్చనున్నట్లు ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. పోర్టుల నుంచి ఎనర్జీ వరకూ అనేక వ్యాపారాల్లో విస్తరించిన అదానీ గ్రూప్ ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ ఎగుమతి దారు సౌదీ అరమ్‌కోలో(Saudi Aramco) పెట్టుబడులు పెట్టేందుకు పావులు కదపటం దీనికి అద్దం పడుతోంది. సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ నుంచి అరమ్‌కోలో వాటాను కొనుగోలు చేయడానికి అదానీ బిలియన్ల డాలర్లను వెచ్చించడానికి సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఉన్న అనేక మార్గాలను అదానీ గ్రూప్ ఇప్పటికే పరిశీలిస్తోంది. గత సంవత్సరం నవంబరులో ముకేశ్ అంబానీకి రిలయన్స్ ఇండస్ట్రీస్, సౌదీ అరమ్‌కో మధ్య డీల్ పక్కన పెట్టడంతో అదానీ దానిని అందిపుచ్చుకునేందుకు ముందుకు సిద్ధమయ్యారు. రిలయన్స్ ఆయిల్, కెమికల్స్ కంపెనీలో 20 శాతం వాటాలను.. 20 నుంచి 25 బిలియన్ డాలర్లకు సౌదీ అరమ్‌కోకు అమ్మేందుకు సుమారు రెండేళ్ల పాటు జరిపిన చర్చలు వ్యాల్యుయేషన్ వ్యత్యాసాల కారణంగా చివరికి విఫలమయ్యాయని తెలుస్తోంది.
2018 నుంచి భారత్ లోని రిఫైనరీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని అరమ్‌కో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే RIL పెట్రో కెమికల్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని ప్రయన్నించింది. ప్రస్తుతం రెన్యూవబుల్ ఎనర్జీ వ్యాపారంలో ఉన్న అదానీ.. పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టటం ద్వారా దిగ్గజ వ్యాపారవేత్తలైన అదానీ, అంబానీలు నేరుగా పోటీలో నిలవనున్నారు. గత సంవత్సరం జూన్ లో క్లీన్ ఎనర్జీ వ్యాపారంలోకి రిలయన్స్ అడుగుపెడుతున్నట్లు అంబానీ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఆ రంగంలో కొన్ని కంపెనీలను కొనుగోలు కూడా చేశారు. ఇదే సమయంలో 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ వ్యా్పారంలో దిగ్గజంగా నిలిచేందుకు అదానీ ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. ఈ రెండు కంపెనీలు ఎనర్జీ, ఇంధన రంగాల్లో వేగంగా పోటీ పడుతున్నాయి.
ఇవీ చదవండి..
Multibagger Returns: ఏడాదిలో పెట్టుబడిని రెండింతలు చేసిన రియల్ ఎస్టేట్ మల్టీబ్యాగర్ స్టాక్..