
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు విధించారు. దీనిలో భాగంగా మన దేశం నుంచి వెళ్లే వాటిపై 27 శాతం చెల్లించాలి. ఏప్రిల్ 9 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. దీని తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంధ్యంలోకి పడిపోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ, మెటల్ రంగాలకు పెట్టుబడి దారులు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ట్రంప్ చర్యల నేపథ్యంలో భారతీయ పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఐటీ, మెటల్ తదితర రంగాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే ఈ రంగాలు ఒడిదొడుకులకు లోనుకావొచ్చని వారి అభిప్రాయం. వాటికి బదులుగా ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఫైనాన్స్ రంగాలలో ఇన్వెస్ట్ మెంట్ మంచిదని చెబుతున్నారు.
అమెరికా ఊహించిన దానికంటే ఎక్కువగా సుంకాలు విధించిందని ఆర్థిక వేత్తల వాదన. దీని వల్ల ఐటీ, లోహాలు వంటి రంగాల నెమ్మదించాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఆందోళనను సూచిస్తుంది. అలాగే ఇతర దేశాలు కూడా ప్రతీకార వాణిజ్య చర్యలకు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఈ కారణాలతో పెట్టుబడిదారులు అన్ని విషయాలను నిశితంగా గమనించాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధింపు తర్వాత భారతీయ మార్కెట్లు గందరగోళానికి గురై, దాదాపు ఒకటిన్నర శాతం క్షీణించాయి. నిఫ్టీ రెండు రోజుల పాటు తన కీలక మద్దతు స్థాయి 23,100 కంటే తక్కువకు పడిపోయి, 22,904.45 వద్ద స్థిరపడింది. చాలా రంగాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.
ఫార్మా రంగాన్ని ఇప్పటి వరకు సుంకాల నుంచి మినహాయించారు. అయితే ఇంతకు ముందు చూడని స్థాయిలో ఫార్మా రావడం ప్రారంభమవుతుందని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా సుంకాల ప్రకటన తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంధ్యంలోకి పడిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ప్రకటన తర్వాత చైనా కూడా ప్రతీకార చర్యలు తీసుకుంది. అమెరికా దిగుమతులపై 34 శాతం సుంకాన్ని విధించింది. ఏప్రిల్ 10 నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి