
దాదాపు ప్రతి ఒక్కరికి బాగా డబ్బు సంపాదించాలని ఉంటుంది. అందుకోసం చాలా కష్టపడతారు కూడా. కానీ, అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతుంటారు. ఎంత సంపాదించినా డబ్బు మాత్రం చేతిలో నిలవదు. అలాంటి సమయాల్లో మనం ఆల్రెడీ ధనవంతులు అయినా వారిలా ఆలోచించాలి. ఎందుకంటే.. ఏ రంగంలోనైనా అనుభవం ఉన్నవారిని అనుకరించడంతో రాణించవచ్చు.
సచిన్, కోహ్లీలా క్రికెట్ ఆడాలని చాలా మంది అనుకోవచ్చు. కానీ, ముందు వారిలా ప్రాక్టీస్ చేయాలి, నెట్స్‌లో చెమలు చిందించాలి, ఆ తర్వాత వారిలా టెక్నిక్స్ నేర్చుకోవాలి, వాటిని ఆటలో ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు సచిన్ కోహ్లీలు అవ్వొచ్చ.. వారి అంత గొప్పవారిగా కాకపోయినా.. కనీసం దేశానికి ప్రాతినిథ్యం అయినా వహించవచ్చు. అలాగే ధనవంతుల్లా ఆలోచిస్తే, వారిని ఆచరిస్తే.. మీరు కూడా డబ్బు సంపాదనను ఒక అలవాటుగా చేసుకోవచ్చు. వారిలా కోట్లకు కోట్లు సంపాదించకపోయినా.. లక్షల్లో సంపాదించుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి