Paytm Stocks: కుప్ప కూలిన పేటీఎం స్టాక్స్‌.. 9700 కోట్ల ఇన్వెస్టర్ల డబ్బు ఆవిరి

ప్రస్తుతం పేటీఎం అనేక అడ్డంకులను ఎదుర్కొంటోంది. పలు ఫిన్‌టెక్‌ కంపెనీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆంక్షలు విధిస్తోంది. పేటీఎం పేమెంట్‌ బ్యాంక్స్‌పై ఆర్బీఐ విధించిన ఆంక్షలతో పేటీఎం షేర్‌ హోల్డర్లలో ఆందోళన మొదలైంది. దీంతో తమ షేర్లను విక్రయించేందుకు షేర్‌ హోల్డర్లు ఎగబడ్డారు. క్షణాల్లోనే స్టాక్స్‌లో క్షీణత నమోదైంది. ఈ నేపథ్యంలోపేటీఎం స్టాక్స్‌..

Paytm Stocks: కుప్ప కూలిన పేటీఎం స్టాక్స్‌.. 9700 కోట్ల ఇన్వెస్టర్ల డబ్బు ఆవిరి
Paytm

Updated on: Feb 02, 2024 | 1:27 PM

దేశంలో పేటీఎం పేమెంట్స్‌ బిజినెస్‌లో జోరందుకుంది.  తక్కువ సమయంలోనే వినియోగదారులకు మరింత చేరువయ్యింది. ప్రస్తుతం పేటీఎం అనేక అడ్డంకులను ఎదుర్కొంటోంది. పలు ఫిన్‌టెక్‌ కంపెనీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆంక్షలు విధిస్తోంది. పేటీఎం పేమెంట్‌ బ్యాంక్స్‌పై ఆర్బీఐ విధించిన ఆంక్షలతో పేటీఎం షేర్‌ హోల్డర్లలో ఆందోళన మొదలైంది. దీంతో తమ షేర్లను విక్రయించేందుకు షేర్‌ హోల్డర్లు ఎగబడ్డారు. క్షణాల్లోనే స్టాక్స్‌లో క్షీణత నమోదైంది. ఈ నేపథ్యంలోపేటీఎం స్టాక్స్‌ కుప్పకూలిపోయాయి. పేటీఎంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చర్య తర్వాత భారీ నష్టాన్ని చవి చూసింది. క్షణాల్లోనే పేటీఎం స్టాక్ 20 శాతం క్షీణతకు గురైంది. Paytm యాజమాన్యంలోని One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 38,600 కోట్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలి నిర్ణయంతో ఇన్వెస్టర్ల డబ్బు  రూ.9,700 కోట్లు వరకు ఆవిరైపోయాయి.

నిజానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ని ఫిబ్రవరి తర్వాత ఏదైనా కస్టమర్ ఖాతా, వాలెట్‌లో డిపాజిట్లు స్వీకరించకుండా లేదా Fastagలో టాప్ అప్ చేయకుండా నిషేధించిన తర్వాత పేటీఎంస్టాక్‌లో ఈ పతనం వచ్చింది. పేటీఎం షేర్ల కోసం ఎలాంటి గణాంకాలు కనిపిస్తున్నాయో కూడా తెలుసుకుందాం.

Paytm షేర్లు 20 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. దీని కారణంగా బిఎస్‌ఇలో కంపెనీ షేర్లు రూ.608.80కి చేరాయి. కాగా ఒక రోజు ముందు కంపెనీ షేర్లు రూ.761 వద్ద ముగిశాయి. విశేషమేమిటంటే కంపెనీ 52 వారాల గరిష్ట స్థాయి అక్టోబర్ 20న వచ్చింది. ఆ రోజు కంపెనీ షేర్లు రూ.998.30కి వచ్చాయి. అప్పటి నుండి దాదాపు 100 రోజులు గడిచాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు 39 శాతం పడిపోయాయి. రానున్న రోజుల్లో కంపెనీ షేర్లలో మరింత క్షీణత కనిపించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి