RBI New Rules: ఖాతాదారులకు ఊరట.. ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్‌ కావు..!

|

Sep 11, 2021 | 12:08 PM

RBI New Rules: ఖాతాదారుల అకౌంట్‌ నుంచి నెలనెల డబ్బులు ఆటోమేటిక్‌గా కటింగ్‌ అయ్యే విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది..

RBI New Rules: ఖాతాదారులకు ఊరట.. ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్‌ కావు..!
Follow us on

RBI New Rules: ఖాతాదారుల అకౌంట్‌ నుంచి నెలనెల డబ్బులు ఆటోమేటిక్‌గా కటింగ్‌ అయ్యే విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు లావాదేవీల విషయంలో ఇప్పటి వరకూ ఈఎంఐలు, ఓటీటీ రెన్యువల్‌ ప్లాన్స్‌ ఇతర ఆన్‌లైన్‌ చెల్లింపులన్నీ ఆటోమేటిక్‌గా నిర్ణీత తేదీ వచ్చే సరికి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్‌ అవుతుంటాయి. ఇకపై అలాంటిదేమి జరగదని, ఇక నుంచి ఖాతాదారుల నుంచి అదనపు ధృవీకరణ తర్వాత డబ్బులు కట్‌ అవుతాయని ఆర్బీఐ వెల్లడించింది. ఇందుకోసం బ్యాంకుల తరపు నుంచి ఖాతాదారుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరని తెలిపింది.. తొలి దశలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ విషయంలో ఈ నిబంధనను వర్తింపజేయబోతోంది.

సాధారణంగా నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌, హాట్‌స్టార్‌ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ సబ్ స్క్రిప్షన్ నెలవారీ ప్యాకేజీల గడువు అయిపోగానే.. చాలామంది యూజర్లకు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి డబ్బులు కట్‌ అయ్యి ప్యాకేజీ రెన్యువల్‌ అవుతుంటుంది. తాజా నిబంధనల ప్రకారం.. ఇక మీదట అలా కుదరదు.

అక్టోబర్‌ 1 నుంచి ఈ నిబంధనను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అమలు చేయనుంది. బ్యాంకింగ్‌ రంగంలో హ్యాకింగ్‌, ఆన్‌లైన్‌ మోసాలు, ఇంటర్నెట్‌ బ్యాకింగ్‌ దొంగతనాలను నిలువరించేందుకు ఏఎఫ్‌ఏ నిబంధనను తీసుకొచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. ఆటోమేటిక్‌గా పేమెంట్‌ డిడక్ట్‌ అయ్యే సమయంలో మోసాలకు, ఆన్‌లైన్‌ దొంగతనాలకు ఆస్కారం ఉంది. అందుకే అడిషనల్‌ ఫ్యాక్టర్‌ ఆఫ్‌ అథెంటికేషన్‌ పద్దతి ద్వారా జరగాలని బ్యాంకులకు సూచిస్తున్నాం అని ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది. కార్డులతో పాటు యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(UPI), ప్రీపెయిడ్‌ పేమెంట్స్‌ ఇన్స్ట్రుమెంట్స్ (PPI) ద్వారా చెల్లింపులకు వర్తించనుంది.

ఇక ఏఎఫ్‌ఏ పద్దతిలో చెల్లింపుల ద్వారా భద్రతపరమైన డిజిటల్‌ చెల్లింపులకు ఆస్కారం ఉంటుందని తెలిపింది., అలాగే రిజిస్ట్రేషన్ సమయంలో, మొదటి ట్రాన్‌జాక్షన్‌, ప్రీ ట్రాన్‌జాక్షన్‌ నోటిఫికేషన్‌, విత్‌డ్రా కోసం ఏఎఫ్‌ఏ తప్పనిసరని, ఇదంతా యూజర్‌ భద్రత కోసమేనని ఆర్బీఐ చెబుతోంది. ఈ నిబంధనలు అమలులోకి రాగానే.. బ్యాంకులు కస్టమర్లను అప్రమత్తం చేస్తాయని వెల్లడించింది.

ఇవీ కూడా చదవండి:

Aadhar Number: ఆధార్‌ నంబర్ మార్చడం కుదరదు.. మారిస్తే అనేక చిక్కులు.. కీలక ప్రకటన చేసిన ఉడాయ్‌

Onion Prices Rise: సామాన్యులకు షాకింగ్‌ న్యూస్‌.. మళ్లీ ఘాటెక్కనున్న ఉల్లి ధర..!

Bullet Train Project: బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులో ఇండియా రైల్వే మరో రికార్డు.. ప్రపంచ దేశాల సరసన భారత్!