
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బ్యాంకింగ్ రంగంలో సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టింది. జులై 2026 నుంచి కొత్త అంబుడ్స్‌మెన్ రూల్స్‌ను అమలు చేయనుంది. నూతనంగా ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ స్కీమ్‌ను తీసుకురానుంది. బ్యాంకులతో పాటు ఎన్‌ఎఫ్‌బీసీ, ఇతర ఫైనాన్షియర్ సంస్థలన్నీ ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంక్ వినియోగదారుల ఫిర్యాదులు వేగవంతం అవ్వడమే కాకుండా బ్యాంకులు తప్పు చేస్తేఇకపై కస్టమర్లకు భారీగా పరిహారం అందనుంది. పరిహారమే కాకుండా కస్టమర్లు అనుభవించిన మానసిక వేదన, ఖర్చులు, సమయం వృథాకు కూడా పెద్ద మొత్తంలో బ్యాంకులు పరిహారంగా అందించాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. దేశంలోనే బ్యాంకింగ్ వినియోగదారులందరికీ ఈ కొత్త రూల్స్‌తో మరింత రక్షణ కలగనుంది. ఈ కొత్త అంబుడ్స్‌మెన్స్ విధానం గురించి మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గతంలో ఉన్న అంబుడ్స్‌మెన్ రూల్స్ ప్రకారం బాధితులు నష్టపోయినప్పుడు గరిష్టంగా రూ.20 లక్షల వరకు మాత్రమే పరిహారం పొందే అవకాశముంది. అయితే ఇప్పుడు ఆ లిమిట్‌ను ఏకంగా రూ.30 లక్షలకు పెంచారు. ఇప్పటినుంచి జరిగిన ఆర్ధిక నష్టానికే కాకుండా బాధితుడి ఎదుర్కొన్న మానసిక వేదన, సమయం, ఇతర ఖర్చులకు గాను గతంలో గరిష్టంగా రూ.లక్ష పరిహారం చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.3 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ రూల్స్ వల్ల బ్యాంకింగ్ ఫిర్యాదుల్లో వేగం పెరగడమే కాకుండా కస్టమర్లకు బ్యాంక్ సర్వీసులపై మరింత నమ్మకం పెరగనుంది. అంతేకాకుండా ఆర్ధిక సంస్థల జవాబాదారీతనం పెరగడమే కాకుండా పారదర్శత ఏర్పడుతుందని ఆర్బీఐ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.
దేశంలోని అన్ని బ్యాంకులతో పాటు ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థలు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్, నాన్ బ్యాంక్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ ప్రొవేడర్లకు కొత్త అంబుడ్స్‌మెన్ రూల్స్ వర్తించనున్నాయి. దీంతో ఇక నుంచి కంపెనీలు ఫిర్యాదుదారుడి కంప్లైంట్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేపపోతే చిన్న తప్పుకే పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు తమ కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించేందుకు అంబుడ్స్‌మెన్స్ ప్రత్యేక అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ అధికారులు బ్యాంకింగ్ రంగంలో బాగా అనుభం కలిగి ఉండాలి. బ్యాంకింగ్ నిర్ణయాలు, కస్టమర్ల హక్కులపై అవగాహన కలిగి ఉండాలి. రిటైర్డ్ అధికారి లేదా ప్రస్తతుం పనిచేస్తున్నవారిలో అనుభవం కలిగినవారి ఉన్నతాధికారులను నియమించుకోవాలి. ప్రతీ బ్యాంకు తమకంటూ సొంత అంబుడ్స్‌మెన్స్ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.