RBI Penalty: ఈ బ్యాంకుపై ఆర్బీఐ రూ.79 లక్షల జరిమానా.. కారణం ఏమిటి..? కస్టమర్లపై ఎలాంటి ప్రభావం పడనుంది..!

|

Sep 25, 2021 | 5:41 PM

RBI Penalty: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై..

RBI Penalty: ఈ బ్యాంకుపై ఆర్బీఐ రూ.79 లక్షల జరిమానా.. కారణం ఏమిటి..? కస్టమర్లపై ఎలాంటి ప్రభావం పడనుంది..!
Follow us on

RBI Penalty: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది. ఇక తాజాగా ముంబైలో ఉన్న అప్నా సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై రూ.79 లక్షల జరిమానా విధించింది. ఆదాయం, ప్రొవిజనింగ్‌, ఇతర సంబంధిత విషయాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లు, డిపాజిట్‌ ఖాతాల నిర్వహణపై ఆర్బీఐ ఆదేశాలు పాటించనందున ఆర్బీఐ ఈ జరిమానా విధించింది. 31 మార్చి, 2019న బ్యాంకు ఆర్థిక స్థితికి సంబంధించి సెంట్రల్‌ బ్యాంక్‌ చట్టపరమైన పర్యవేక్షణను నిర్వహిస్తోంది. ఎన్‌సీఏ వర్గీకరణ, మరణించిన డిపాజిటర్ల కరెంటు ఖాతాలలో ఉన్న డిపాజిట్లపై వడ్డీ చెల్లింపు లేదా క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్‌, కనీస బ్యాలెన్స్‌ను నిర్వహించకపోవడం వంటి విషయాలలో నిబంధనలు పాటించడం లేదని తేలిందని, అందుకే ఈ భారీ జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే పేర్కొన్న ఆదేశాలను ఉల్లంఘించినందున పెనాల్టీ ఎందుకు విధించకూడదో తెలియజేయాలని ఆర్బీఐ బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది. నోటీసుకు బ్యాంకు ప్రతిస్పందనను పరిశీలించినప్పుడు ఆర్బీఐ ఆదేశాలు పాటించలేదని నిర్ధారణ అయినట్లు ఆర్బీఐ తెలిపింది.

కాగా, ఇదే నెలలో మధ్యప్రదేశ్‌లోని జిల్లా కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ మర్యాదిత్‌కు లక్ష రూపాయల జరిమాని విధించింది. నో యువర్‌ కస్టమర్ (కైవైసీ) నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించినట్లు వెల్లడించింది. అలాగే ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉన్న కుప్పం కో ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకుకు కూడా ఆర్బీఐ రూ.5 లక్షల జరిమానా విధించింది. ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలను పాటించనందున ఈ జరిమానా విధించింది. ఆదాయం గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, కేటాయింపులు, ఇతర అంశాలపై మాస్టర్‌ సర్క్యూలర్‌, పట్టణ సహకార బ్యాంకుల డైరెక్టర్ల బోర్డుపై మాస్టర్‌ సర్క్యూలర్‌ ఉల్లంఘనలపై ఈ చర్యలు చేపట్టినట్లు ఆర్బీఐ తెలిపింది.

కస్టమర్లపై ఎఫెక్ట్‌ పడనుందా..?

ఆర్బీఐ విధించిన ఈ జరిమానా అంశం వినియోగదారుల లావాదేవీలపై ఏ మాత్రం ప్రభావం చూపదని ఆర్బీఐ అధికారులు తెలిపారు. ఈ బ్యాంకులకే కాకుండా ఇదే నెలలో రెండు బ్యాంకులకు పెనాల్టీ విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన ముంబై మెర్కంటైల్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకుకు రూ.50 లక్షల జరిమానా విధించింది. అలాగే మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఉన్న సెంట్రల్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్ కేవైసీ నిబంధనలు పాటించనందున రూ.2 లక్షల జరిమానా విధించింది. అయితే బ్యాంకులకు జరిమానా విధించడం వల్ల కస్టమర్ల పెట్టుబడులపై ఎలాంటి ప్రభావితం చేయదని ఆర్బీఐ స్పష్టం చేసింది. సహకార బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేటు, 2016, ఫ్రేమ్‌ వర్క్‌ కింద ఆదేశాలు పాటించనందున ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ వెల్లడించింది.

ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ కోల్‌కతాలోని విలేజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు కేవైసీ నిబంధనలు పాటించనందున రూ.5 లక్షల జరిమానా విధించింది. అహ్మద్‌నగర్‌ మర్చంట్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకుకు రూ.13 లక్షలు, అహ్మదాబాద్‌లోని మహిళా వికాస్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకుకు రూ.2 లక్షల జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తున్న కారణంగా బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది ఆర్బీఐ.

ఇవీ కూడా చదవండి:

Income Tax Return: పన్ను రిటర్న్‌ దాఖలు చేసేవారికి గుడ్‌న్యూస్‌.. ఆలస్యమైనా పెనాల్టీ ఉండదు.. ఎవరికి అంటే..?

LIC Housing Finance: ఎల్‌ఐసీ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. తక్కువ వడ్డీకే రూ.2 కోట్ల వరకు రుణాలు..!

WhatsApp Cashback: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు.. ఒక్కసారి పేమెంట్‌ చేస్తే..!