Rent Agreement Rule: ఇంటిని అద్దెకు తీసుకున్న తర్వాత 11 నెలలకు మాత్రమే అగ్రిమెంట్‌ ఎందుకు చేసుకుంటారు?

|

Dec 04, 2022 | 5:59 PM

మీరు అద్దె ఇంట్లో నివసిస్తుంటే రెంట్ అగ్రిమెంట్ చేసుకోవడం తప్పనిసరి. అద్దె ఒప్పందం మీ భద్రతను చూసుకుంటుంది. ఇది మీకు రుజువుగా కూడా పనిచేస్తుంది. అయితే..

Rent Agreement Rule: ఇంటిని అద్దెకు తీసుకున్న తర్వాత 11 నెలలకు మాత్రమే అగ్రిమెంట్‌ ఎందుకు చేసుకుంటారు?
Rent Agreement Rule
Follow us on

మీరు అద్దె ఇంట్లో నివసిస్తుంటే రెంట్ అగ్రిమెంట్ చేసుకోవడం తప్పనిసరి. అద్దె ఒప్పందం మీ భద్రతను చూసుకుంటుంది. ఇది మీకు రుజువుగా కూడా పనిచేస్తుంది. అయితే అద్దెకు సంబంధించిన అగ్రిమెంట్ 11 నెలలు మాత్రమే చేసుకుంటారు. అయితే ఏడాది కాకుండా ఇలా 11 నెలలకు అగ్రిమెంట్‌ చేసుకుందుకు కారణాలున్నాయి. రిజిస్ట్రేషన్ చట్టం 1908 ప్రకారం.. ఒక ఆస్తిని ఒక సంవత్సరం లీజుపై నమోదు చేయడం తప్పనిసరి. అందువల్ల రిజిస్ట్రేషన్ నిబంధనలు ఉల్లంఘించరాదు. అందుకే అద్దె ఒప్పందాలు సాధారణంగా పదకొండు నెలల కాలానికి డ్రాఫ్ట్ చేయబడతాయి. అది దాటితే పైన పేర్కొన్న విధంగా చట్టం క్రింద తప్పనిసరిగా నమోదు చేయాలి. అద్దె ఒప్పందం, లీజు ఒప్పందానికి భారత రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 17(D) కింద పలు నిబంధనలు ఉన్నాయి. ఒక అగ్రిమెంట్ రిజిస్టర్ చేసుకున్నట్లయితే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడం తప్పనిసరి అవుతుంది. అటువంటి భారీ ఛార్జీల చెల్లింపును తప్పించుకోవడం కోసం భూస్వామి, అద్దెదారు ఒప్పందాన్ని నమోదు చేసుకోకుండా పరస్పరం అంగీకరించవచ్చు. ఇంకా 11 నెలల అద్దె ఒప్పందం అనేది భూస్వామికి మరింత సౌలభ్యాన్ని ఇస్తుంది. అలాగే మార్కెట్‌ ప్రకారం అద్దెను సెట్ చేయవచ్చు.

11 నెలల అద్దె ఒప్పందం కారణం ఏంటి?

న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యజమాని అద్దె ఒప్పందాన్ని 11 నెలల పాటు పూర్తి చేయడం వెనుక ఒక కారణం ఉంది. కౌలుదారు, యజమాని మధ్య వివాదం ఉన్నప్పుడు, యజమాని అద్దెదారుని ఖాళీ చేయవలసి ఉంటుంది. కానీ 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఒప్పందం కారణంగా అతను ఖాళీ చేయలేడు. అప్పుడు కోర్టుకు వెళ్లిన తర్వాత అద్దెదారు ఆ ఆస్తిని సంవత్సరాల పాటు స్వాధీనంలో ఉంచుకోవచ్చు. ఈ కారణంగా ఒప్పందం 11 నెలలకు మాత్రమే చేస్తారు.

చట్టం ఏం చెబుతోంది?

11 నెలలకు పైగా అద్దె ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత అద్దెదారు ఇంటి యజమానికి ఎలాంటి అద్దె చెల్లించినా, భవిష్యత్తులో వివాదం ఏర్పడి కోర్టుకు వెళితే, ఆ అద్దె మొత్తాన్ని కూడా కోర్టు నిర్ణయించవచ్చు. . అంతకంటే ఎక్కువ అద్దె వసూలు చేయరాదు.

ఇవి కూడా చదవండి

రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ చెల్లించడం తప్పనిసరి కాదు

ఇది కాకుండా 11 నెలల అద్దె ఒప్పందంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా ప్రధాన అంశం. 11 నెలల పాటు ఒప్పందం చేసుకున్నట్లయితే ఈ రెండు మొత్తాలను చెల్లించడం తప్పనిసరి కాదు. యజమాని ఎప్పుడైనా అద్దెదారుతో ఒప్పందాన్ని ముగించవచ్చు. అలాగే అతను ఎప్పుడైనా అద్దె పెంచవచ్చు. 11 నెలల నోటరీ చేయబడిన అద్దె ఒప్పందం ముసాయిదా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది. వివాదం విషయంలో సాక్ష్యంగా ఉపయోగించవచ్చు. మీరు రూ.100 లేదా రూ.200 స్టాంపు పేపర్‌పై కోర్టు నుండి తయారు చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి