Jio Prepaid plan: పిచ్చెక్కిస్తున్న జియో ఎంటర్టైన్‌మెంట్ ప్లాన్! ఓటీటీ యాప్స్ అన్నీ ఒకేచోట!

సాధారణంగా మంత్లీ రీఛార్జ్ ప్లాన్స్ లో అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు రోజువారీ డేటా వంటి బెనిఫిట్స్ వస్తుంటాయి. కానీ, జియో తీసుకొచ్చిన కొత్త కంప్లీట్ ప్లాన్ లో సుమారు12 కి పైగా ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ ప్లాన్ వివరాల్లోకి వెళ్తే..

Jio Prepaid plan: పిచ్చెక్కిస్తున్న జియో ఎంటర్టైన్‌మెంట్ ప్లాన్! ఓటీటీ యాప్స్ అన్నీ ఒకేచోట!
రిలయన్స్ జియో రూ.150 లోపు జియో ఫోన్ వినియోగదారుల కోసం ప్లాన్‌లను కలిగి ఉంది. మీకు జియో ఫోన్ ఉంటే మీరు కూడా ఈ సరసమైన ప్లాన్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. తక్కువ ధరల్లోనే అపరిమిత కాల్స్‌ను అందుకోవచ్చు. అలాగే డేటా కూడా అందుకోవచ్చు.

Updated on: Oct 03, 2025 | 4:48 PM

ప్రముఖ టెలికాం నెట్వర్క్ కంపెనీ రిలయన్స్ జియో.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెస్తుంటుంది. అందులోభాగంగానే ఓ కొత్త ప్లాన్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. అదే రూ. 445 మంత్లీ ప్లాన్. ఇది ఒక కంప్లీట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే కాల్స్‌తోపాటు, రోమింగ్, డేటా, ఎంటర్‌‌టైన్‌మెంట్ ప్యాక్స్. ఇలా అన్ని ఫీచర్స్  లభిస్తాయి.

ప్లాన్ డీటెయిల్స్

ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే యూజర్లకు 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ 28 రోజుల్లో కంప్లీట్ ప్రయోజనాలను అందుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్ , అన్‌లిమిటెడ్ 5జీ నెట్‌వర్క్‌తోపాటు రోజుకి 2జీబీ 5జీ డేటాని కూడా అందిస్తుంది. ఒకవేళ మీ ఫోన్ 4జీ అయితే రోజుకు 2జీబీ హై స్పీడ్ డేటా వస్తుంది. ఆ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 64కెబీపీఎస్ స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా వస్తుంది. అలాగే ఈ ప్లాన్ లో యూజర్లకు డైలీ 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు వస్తాయి. వీటితోపాటు ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 12 ఓటీటీ యాప్స్ కి 28 రోజుల ఉచిత యాక్సెస్ అందిస్తుంది. అ

ఈ ప్లాన్ ఆఫర్ చేసే ఓటీటీ యాప్స్ విషయానికి వస్తే.. సోనీ లివ్, జీ5, లయన్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, కాంచాలాంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, ఫ్యాన్ కోడ్, హోయ్ చోయ్, జియో టీవీ వంటి యాప్స్‌ను యాక్సెస్ చేసే అవకాశం ఉంది. అలాగే జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూపన్ కూడా లభిస్తుంది.

మూడు నెలల ప్లాన్

ఇక దీంతోపాటు జియో మరో మూడు నెలల ప్లాన్ ను కూడా తీసుకొచ్చింది. రూ.899 పెట్టి రీఛార్జ్ చేస్తే.. 90 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు 20జీబీ అదనపు డేటాను కూడా లభిస్తుంది. అంటే మొత్తం డేటా 200జీబీ అవుతుంది. అలాగే ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి.

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.