Jio Pc AI: కేవలం రూ.400తోనే మీ టీవీని కంప్యూటర్‌గా మార్చుకోండి.. జియో క్లౌడ్-బేస్డ్ జియోపీసీ AI

Jio Pc AI: క్లౌడ్ ఆధారిత జియో-పీసీ చాలా శక్తివంతమైనదని కంపెనీ చెబుతోంది. దీని ప్రాసెసింగ్ పవర్ కూడా గొప్పగా ఉండబోతోంది. అలాగే ఇది రోజువారీ వాడకంతో పాటు గేమింగ్, గ్రాఫిక్ రెండరింగ్ వంటి హై-ఎండ్ పనులను సులభంగా నిర్వహించగలదు. జియో-పీసీ..

Jio Pc AI: కేవలం రూ.400తోనే మీ టీవీని కంప్యూటర్‌గా మార్చుకోండి.. జియో క్లౌడ్-బేస్డ్ జియోపీసీ AI

Updated on: Aug 02, 2025 | 8:00 AM

Jio Pc AI: మీరు కూడా కొత్త కంప్యూటర్ కొనాలని ఆలోచిస్తున్నారా? మీకో గుడ్‌న్యూస్‌ ఉంది. డిజిటల్ విప్లవం వైపు రిలయన్స్ జియో మరో పెద్ద అడుగు వేసింది. రిలయన్స్ సరికొత్త జియో-పిసిని ప్రవేశపెట్టింది. ఇది క్లౌడ్ ఆధారిత వర్చువల్ డెస్క్‌టాప్ ప్లాట్‌ఫామ్. దీని సహాయంతో మీరు ఇంట్లో లేదా కార్యాలయంలోని ఏదైనా టీవీ స్క్రీన్‌ను నిమిషాల్లో హై ఎండ్ పర్సనల్ కంప్యూటర్‌గా మార్చవచ్చు. JioFiber లేదా JioAirFiber కనెక్షన్ ఉన్న వినియోగదారులు Jio-PCని ఉపయోగించడానికి అదనపు నెలవారీ ప్లాన్ తీసుకోవాలి. కొత్త వినియోగదారులు ఈ సేవను ఒక నెల పాటు ఉచితంగా ఉపయోగించవచ్చు.

ఇది కూడా చదవండి: Hero Vida: సింగిల్ ఛార్జింగ్‌తో 142కి.మీ మైలేజ్‌.. ధర కేవలం రూ.45,000 మాత్రమే.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

దీనిని ఉపయోగించడం చాలా సులభం:

ఇవి కూడా చదవండి

దీనిని క్లౌడ్ కంప్యూటింగ్‌లో దేశంలోనే మొట్టమొదటి ‘పే-యాజ్-యు-గో మోడల్’గా అభివర్ణిస్తున్నామని జియో చెబుతోంది. అంటే మీరు దీన్ని ఎంత ఉపయోగిస్తే అంత చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ సేవ కోసం కంపెనీ ఎటువంటి లాక్-ఇన్ వ్యవధిని నిర్ణయించలేదు. ఈ ఒక్క ప్లాన్‌తో వినియోగదారులు ఎటువంటి నిర్వహణ ఖర్చును భరించాల్సిన అవసరం లేదు లేదా ఖరీదైన హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్లగిన్ చేసి సైన్ అప్ చేయడం ద్వారా ఈ కంప్యూటింగ్ సేవను ఉపయోగించడం ప్రారంభించవచ్చు.

ఇది కూడా చదవండి: Traffic Challans: గుడ్‌న్యూస్‌.. మీ వాహనంపై చలాన్లు ఉన్నాయా? సగం డబ్బులు మాఫీ!

క్లౌడ్ ఆధారిత జియో-పీసీ చాలా శక్తివంతమైనదని కంపెనీ చెబుతోంది. దీని ప్రాసెసింగ్ పవర్ కూడా గొప్పగా ఉండబోతోంది. అలాగే ఇది రోజువారీ వాడకంతో పాటు గేమింగ్, గ్రాఫిక్ రెండరింగ్ వంటి హై-ఎండ్ పనులను సులభంగా నిర్వహించగలదు. జియో-పీసీ లాంటి పవర్ ఉన్న కంప్యూటర్ మార్కెట్లో రూ.50 వేల కంటే ఎక్కువ ధరకు అందుబాటులో ఉంది. మరోవైపు జియో ఈ సౌకర్యాన్ని కేవలం రూ.400 నెలవారీ ప్లాన్‌పై అందిస్తోంది. అంటే, నెలకు రూ.400 చెల్లించడం ద్వారా మీరు రూ.50,000 వరకు ఆదా చేసుకోవచ్చు. సబ్‌స్క్రిప్షన్‌తో వినియోగదారులు అన్ని ప్రత్యేక AI సాధనాలు, అప్లికేషన్లు, 512GB వరకు ఉచిత క్లౌడ్ నిల్వను కూడా పొందుతారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ లక్ష దాటనున్న బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి