JIo Network Down: అక్కడ జియో నెట్‌వర్క్ డౌన్.. ట్విట్టర్లో కస్టమర్ల ఫిర్యాదుల వెల్లువ..

JIo Network Down: రిలయన్స్ జియో కస్టమర్లు నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. రిలయన్స్ జియో నెట్‌వర్క్ డౌన్ కావటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

JIo Network Down: అక్కడ జియో నెట్‌వర్క్ డౌన్.. ట్విట్టర్లో కస్టమర్ల ఫిర్యాదుల వెల్లువ..
Reliance Jio
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Jun 06, 2022 | 8:04 AM

JIo Network Down: బీహార్, జార్ఖండ్‌లోని రిలయన్స్ జియో కస్టమర్లు నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. రిలయన్స్ జియో నెట్‌వర్క్ డౌన్ కావటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మొత్తం బీహార్, జార్ఖండ్‌లలో జియో నెట్‌వర్క్ దాదాపు అరగంట పాటు నిలిచిపోయింది. దీని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు.. జియో కేర్ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే ట్విట్టర్‌లో ఫిర్యాదుల వెల్లువ ప్రారంభమైంది. అయితే అరగంట తర్వాత అంతా సాధారణ స్థితికి చేరుకుంది. నెట్‌వర్క్ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని తెలుస్తోంది.

Jio నెట్‌వర్క్ డౌన్ కారణంగా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ట్విట్టర్‌లో స్పష్టంగా చూడవచ్చు. Jio Care వినియోగదారులందరికీ వారి సమస్యలను పరిష్కరిస్తామని ట్విట్టర్ ద్వారా హామీ ఇచ్చింది. సమస్యను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి కొంతమంది కస్టమర్‌ల నుంచి Jio కేర్ మరింత సమాచారాన్ని కూడా కోరింది.

బీహార్-జార్ఖండ్ ప్రజల్లో ఈ సమస్యం కేవలం తమ ప్రాంతంలో మాత్రమే ఉందా లేదా ఇతర ప్రాంతాల్లోని వ్యక్తులు కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారా అనే గందరగోళానికి గురయ్యారు. ఒక వినియోగదారు తన ప్రాంతంలో చాలా కాలం పాటు ప్రత్యక్ష ప్రసారం నిలిపివేయబడిందంటూ ట్విట్టర్ లో వెల్లడించాడు. ఇది రాంచీలో మాత్రమే ఉందా లేదా జార్ఖండ్, బీహార్ మొదలైన వాటిలో ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. భువనేశ్వర్‌కు చెందిన ఒక వినియోగదారు తన ప్రాంతంలో కూడా జియో నెట్‌వర్క్ రావడం లేదని రాశారు. సుమారు గంట పాటు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు అతడు తెలిపాడు. దేశవ్యాప్తంగా జియో నెట్‌వర్క్‌ రావడం లేదని కొంతమంది వినియోగదారులు భయపడుతున్నారు. చాలా మంది వినియోగదారులు తమ మెుబైల్ స్కీన్ షాట్లను కూడా షేర్ చేయడం ప్రారంభించారు. దీనిపై ప్రముఖ వార్తా సంస్థ కంపెనీని సంప్రదించగా.. బీహార్, పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఉన్నట్లు వారు వెల్లడించారు. జార్ఖండ్‌లో జియో నెట్‌వర్క్ డౌన్ అయిందన్న విషయాన్ని వారు కొట్టిపారేశారు.