రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ముఖేష్ అంబానీ తన వ్యాపారంలో మరింతగా దూసుకుపోతున్నారు. కొత్త కొత్త వ్యాపారాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక తాజాగా అంబానీ కన్ను మెట్రోపై పడింది. మెట్రో పేరిట దేశ వ్యాప్తంగా హోల్‌సేల్ బిజినెస్ చేస్తున్న జర్మనీకి చెందిన మెట్రో ఏజీ నుంచి భారత వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయబోతోంది. మెట్రో కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే చర్చలు చివరి దశకు చేరినట్లు సమాచారం. మెట్రోను దక్కించకునేందుకు రిలయన్స్‌తో పాటు ఇతర సంస్థలు పోటీ పడగా, అవి పోటీ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మెట్రోను దక్కించుకునేందుకు రిలయన్స్‌కు మార్గం క్లియర్ అయినట్లు తెలుస్తోంది. అయితే మెట్రోను రూ.4,060 కోట్లకు కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని నెలలుగా కొనుగోలు ఒప్పం కోసం ఇరు కంపెనీల మధ్య చర్చలు కూడా జరిగినట్లు గతం వారం క్రితం రిలయన్స్ రిటైల్ ప్రతిపాదనకు జర్మనీ కంపెనీ అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఈ ఒప్పందంలో మెట్రో క్యాష్ అండ్ క్వారీకి చెందిన 31 హోల్‌సేల్ పంపిణీ కేంద్రాలు, భూమి, ఇతర ఆస్తులు ఉన్నాయి.’మెట్రో’ స్టోర్ లు భారత్ లోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఉన్నాయి. చవకైన ధరలకు అన్ని రకాల వస్తువులను తమ బిజినెస్ కస్లమర్లకు మాత్రమే అందించే స్టోర్లుగా వాటికి మంచి పేరుంది.
అయితే, రిటైల్ రంగంలో ప్రధాన పోటీదారుగా ఉన్న రిలయన్స్ సంస్థ మెట్రో ఇండియా బిజినెస్‌ను దక్కించుకునే దిశగా ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి తుది దశలో ఉన్నట్లు సమాచారం. మెట్రో స్టోర్లు జర్మనీ కి చెందిన ఏజీ గ్రూప్ నకు చెందినవి. 2003లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన మెట్రో ఇండియా.. దాదాపు 34 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌లో 31 కేంద్రాలున్నాయి. మెట్రో క్యాష్ అండ్ క్వారీకి బెంగళూరులో 6, హైదరాబాద్‌లో 4, ముంబైలో 4, న్యూఢిల్లీలో ఒక్కొక్కటి రెండు స్టోర్స్ ఉన్నాయి. ఇక కోల్‌కతా, జైపూర్, నాసిక్, ఘజియాబాద్, విజయవాడ, తుంకూరు, విశాఖ, గుంటూరు, ఇండోర్, లక్నో, మీరట్, అమృత్‌సర్, అహ్మద
కోల్‌కతా, జైపూర్, జలంధర్, అమృత్‌సర్, అహ్మదాబాద్, సూరత్, ఇండోర్, లక్నో, మీరట్, నాసిక్, ఘజియాబాద్, తుంకూరు, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, హుబ్లీలలో ఒక్కో కేంద్రం ఉంది. జూలై 2020 ఇ-కామర్స్ మేజర్ ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ వాల్-మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వంద శాతం వాటాను కొనుగోలు చేసింది. అయితే వాల్-మార్ట్ మంచి లాభాలతో క్యాష్ అండ్ క్యారీ వ్యాపారాన్ని బాగా నిర్వహించింది. అనేక కంపెనీలు మెట్రో క్యాష్ అండ్ క్యారీ బిజినెస్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయి. గత నెలలో మెట్రో భారతదేశం కొనుగోలు కోసం ఆ సంస్థ తమ బిడ్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నెలలో మెట్రో డీల్‌ను ముగించే అవకాశం ఉన్నందున డి-మార్ట్, హైపర్ మార్కెట్‌లకు వ్యతిరేకంగా రిలయన్స్ పోరాటానికి సిద్ధమైంది. ప్రపంచంలోని టాప్-20 అత్యుత్తమ కంపెనీలలో రిలయన్స్‌కు మంచి పేరుంది. ఫోర్బ్స్ 2022 ప్రపంచంలోని ఉత్తమ ఉద్యోగార్ధుల ర్యాంకింగ్ ప్రకారం రిలయన్స్ 20వ స్థానాన్ని దక్కించుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి