Diwali Offers: దివాళి సందర్భంగా రిలయన్స్ డిజిటల్ భారీ ఆఫర్లు! వీటిపై క్రేజీ డిస్కౌంట్స్!

దీపావళి సీజన్ మొదలవ్వడంతో చాలా కంపెనీలు ఆఫర్లు అనౌన్స్ చేస్తున్నాయి. రిసెంట్ గా రిలయన్స్ డిజిటల్ వినియోగదారుల ఒక ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ పేరుతో సాగే ఈ సేల్ లో ఎలక్ట్రానిక్స్ అన్నింటిపై భారీ ఆఫర్లు ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే..

Diwali Offers: దివాళి సందర్భంగా రిలయన్స్ డిజిటల్ భారీ ఆఫర్లు! వీటిపై క్రేజీ డిస్కౌంట్స్!
Diwali Offers

Updated on: Oct 06, 2025 | 4:21 PM

రిలయన్స్ డిజిటల్ ప్రకటించిన ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సేల్..  అక్టోబర్ 25 వరకు కొనసాగుతుంది. ఆఫ్ లైన్ లో ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేసేవాళ్లకు ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఈ సేల్‌లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్ లు.. ఇలా అన్ని ఎలక్ట్రానిక్స్ పై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మంచి డిస్కౌంట్లు ఉన్న కొన్ని డీల్స్‌ వివరాలు ఇప్పుడు చూద్దాం.

స్మార్ట్ టీవీలు

ఈ సేల్ లో స్మార్ట్ టీవీలపై మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి.  తోషిబా 65 ఇంచ్ క్యూఎల్ ఈడీ టీవీ  కేవలం రూ. 45,990కే అందుబాటులో ఉంది. దీంతోపాటు పలు బ్రాండెడ్ 55 ఇంచెస్ 4కె స్మార్ట్ టీవీలు రూ. 27,499కే లభిస్తున్నాయి. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీల ఇంకా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ ఫోన్స్

ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై క్రేజీ డీల్స్ ఉన్నాయి. ఐఫోన్16ఈ.. రూ.44,990 నుంచి లభిస్తుంది. అలాగే ఐఫోన్14పై రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రూ4,000 క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. ఈ సేల్ లో యాపిల్ వాచ్ సిరీస్ ధరలు రూ. 44,400 నుంచి ప్రారంభమవుతున్నాయి. దీంతోపాటు మోటరోలా, గూగుల్ పిక్సెల్ ఫోన్లపై కూడా డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా తగ్గింపు లభిస్తోంది..

హోమ్ అప్లయెన్సెస్

ఇక ఈ సేల్ లో 1 టన్ 3 స్టార్ ఏసీలు రూ.17,990 నుంచి ప్రారంభమవుతున్నాయి. అలాగే డబుల్ డోర్ ఫ్రిజ్‌లు రూ.18,990 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఫ్రిజ్ కొనుగోలుపై రూ.8,990 వరకూ ఫ్రీ గిఫ్టులు కూడా ఉన్నాయి. టాప్ లోడ్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ ఈ సేల్ లో రూ.10,990 నుంచి అందుబాటులో ఉంది.

ఆఫర్ల వివరాలు

రిలయన్స్ డిజిటల్ సేల్‌లో పలు బ్యాంక్ కార్డ్స్ పై ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయి. బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా రూ.15,000 వరకూ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఈఎంఐ లేదా ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేస్తే  రూ. 30,000 వరకూ క్యాష్‌బ్యాక్ రూపంలో బెనిఫిట్ పొందొచ్చు. ఈ సేల్‌లో  నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి