Business Ideas: మీ ఇంటిలో ఖాళీ స్థలం ఉందా.? ఈ వ్యాపారం ప్రారంభిస్తే నెల రూ. 50 వేలు పక్కా.!
స్కూల్‌కి పిల్లలకు బ్రేక్ వచ్చినా.. పనిలో ఎంప్లాయిస్ చిన్న బ్రేక్ తీసుకున్నా.. తినడానికి ఏదైనా స్నాక్ కచ్చితంగా ఉండాల్సిందే. ఈ మధ్య అయితే బయట ఫుడ్ మరీ నాసిరకంగా మారింది. అది తింటే చాలు లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకే చాలామంది బయట ఏదైనా ఆహారాలను, స్నాక్స్‌ను తీసుకునేటప్పుడు..
స్కూల్‌కి పిల్లలకు బ్రేక్ వచ్చినా.. పనిలో ఎంప్లాయిస్ చిన్న బ్రేక్ తీసుకున్నా.. తినడానికి ఏదైనా స్నాక్ కచ్చితంగా ఉండాల్సిందే. ఈ మధ్య అయితే బయట ఫుడ్ మరీ నాసిరకంగా మారింది. అది తింటే చాలు లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకే చాలామంది బయట ఏదైనా ఆహారాలను, స్నాక్స్‌ను తీసుకునేటప్పుడు క్వాలిటీని దృష్టిలో పెట్టుకుంటున్నారు. మరి అలాంటప్పుడు మీరే స్నాక్స్‌ను ఇంట్లో తయారు చేసి.. ఎందుకని బయట అమ్మకూడదు.? అదేనండీ.. అర్ధం కాలేదా.. రకరకాల స్నాక్స్, చిప్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఓ పనైపోతుంది. ఈ వ్యాపారానికి పెద్దగా పెట్టుబడి అక్కర్లేదు. రిస్క్ తక్కువ.. సరిగ్గా క్లిక్ అయితే రాబడి ఎక్కువ ఉంటుంది. దీన్ని స్టార్ట్ చేయడానికి కావాల్సిందల్లా.. మీ ఇంటిలో చిన్న ఖాళీ స్థలం. అందులో ఓ టెంట్ వేసుకుని.. చిన్నగా ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టండి. స్థానికంగా మీ వ్యాపారానికి మౌత్ పబ్లిసిటీ వస్తే.. అదే ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది.
ఈ చిప్స్ తయారీకి పెద్ద పెద్ద మెషిన్లు అవసరం లేదు. కొన్ని పరికరాలను తీసుకుంటే చాలు. కూరగాయలను ముక్కలు కోసేందుకు కట్టర్, ఓ పెద్ద బాండీ, పెద్ద మూకుడు, నూనె, ఉప్పు, మసాలా.. ఇక చిన్న చిన్న కవర్ ప్యాకెట్లు.. చిప్స్‌ను పార్శిల్ చేసేందుకు అవసరం అవుతుంది. మీ ఇంటి దగ్గరున్న హోల్‌సేల్ షాపులతో పాటు.. స్థానికంగా మీరే షాపు కింద పెట్టుకుని వీటిని అమ్మొచ్చు. సుమారు 10 కిలోల చిప్స్ అమ్మితే.. దాదాపుగా రూ. వెయ్యి వరకు మిగులుతుంది. ఇలా చూసుకుంటే.. రోజుకు నాలుగు వేల వరకు సంపాదించవచ్చు. క్వాలిటీ, క్వాంటిటీ మీరు రెండూ మైంటైన్ చేయగలిగితే.. కచ్చితంగా ఈ వ్యాపారంలో అధిక లాభాలను చూడవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..