ఇటీవల కాలంలో ఆన్‌లైన్ చెల్లింపుల్లో భారతదేశంలో ప్రపంచ దేశాలతో పోటీపడుతుంది. ఎక్కువ స్థాయి పేమెంట్స్ యూపీఐ ద్వారా సాగుతుంటే అఫిషియల్ పేమెంట్స్ మాత్రం ఇప్పటికీ ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్‌టీ ద్వారా చేస్తున్నారు. అయితే పెరిగిన టెక్నాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో? అదే స్థాయిలో నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్‌టీ ద్వారా చేసే పేమెంట్స్ విషయంలో ఖాతా నంబర్ తప్పు నమోదు చేయడంతో ఇతర మోసాలను అరికట్టేందు ఆర్‌బీఐ కీలక చర్యలను తీసుకుంది. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సిస్టమ్ (ఆర్టీజీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (ఎన్ఈఎఫ్‌టీ) సిస్టమ్ కోసం లబ్ధిదారుల పేరు ధ్రువీకరణ సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు చెల్లింపుల విషయంలో ఆర్‌బీఐ తాజా నిర్ణయం మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఆర్‌బీఐ తాజా నిర్ణయం కారణం పేమెంట్ ట్రాన్స్‌క్షన్‌ను అమలు చేయడానికి ముందు రిసీవర్ (లబ్దిదారు) పేరును ధ్రువీకరించే విషయంలో పేమెంట్ పంపేవారికి సహాయం చేస్తుంది. ఆర్టీజీఎస్, నెఫ్ట్ చెల్లింపుదారులు నిధుల బదిలీని ప్రారంభించే ముందు లబ్ధిదారుని ఖాతాదారుని పేరును ధ్రువీకరించడానికి, ఇప్పుడు షో బెన్‌ఫీయరీ నేమ్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టనున్నారు. చెల్లింపుదారులు లబ్ధిదారుని ఖాతా నంబర్, బ్రాంచ్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను ఇన్‌పుట్ చేయవచ్చు. దాని తర్వాత లబ్ధిదారుని పేరు ప్రదర్శితమవుతుంది. ఈ సదుపాయం కస్టమర్ విశ్వాసాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఇది తప్పుడు క్రెడిట్‌లతో పాటు మోసాల సంభావ్యతను తగ్గిస్తుంది. వివరణాత్మక మార్గదర్శకాలు త్వరలో జారీ చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
యూపీఐ, ఐఎంపీఎస్ వంటి చెల్లింపు వ్యవస్థల్లో ఇప్పటికే లావాదేవీని ప్రారంభించే ముందు రిసీవర్ (లబ్దిదారు) పేరును ధ్రువీకరించే సదుపాయం ఉంది. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సిస్టమ్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్ ) సిస్టమ్‌ల కోసం ఇలాంటి సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలని అభ్యర్థనలు వచ్చాయని ఆర్‌బీఐ అధికారులు చెబుతున్నారు. ఈ సదుపాయం ద్వారా చెల్లింపుదారుడు ఆర్‌టీజీఎస్ లేదా నెఫ్ట్ ద్వారా అతనికి/ఆమెకు నిధుల బదిలీని చేసే ముందు ఖాతాదారుని పేరును ధ్రువీకరించుకుని నిధులు పంపే వెసులుబాటు ఉంటుంది. పేరు తప్పుగా చూపిస్తే లావాదేవీను నిలిపేసే సదుపాయం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి