Bank Account: ఆర్బీఐ షాకింగ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ఈ బ్యాంకు ఖాతాలు క్లోజ్‌.. ఎందుకంటే!

|

Dec 30, 2024 | 8:43 PM

Bank Account: చాలా మందికి బ్యాంకు ఖాతాలు ఉంటాయి. కొందరికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. కానీ అన్ని ఖాతాలు యాక్టివ్‌గా ఉంటేనే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకుంటే ఖాతాలు మూసివేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది..

Bank Account: ఆర్బీఐ షాకింగ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ఈ బ్యాంకు ఖాతాలు క్లోజ్‌.. ఎందుకంటే!
Follow us on

జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా లక్షలాది బ్యాంకు ఖాతాలు మూతపడే అవకాశం ఉంది. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మోసాలను తగ్గించడానికి RBI తరచుగా చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి జనవరి 1 నుంచి మూడు రకాల బ్యాంకు ఖాతాలను మూసివేయాలని ఆర్బీఐ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్థిక అవకతవకలను నిరోధించడానికి, ఆధునికీకరణ, డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడానికి ఈ చర్య తీసుకుంది.

ఇన్‌యాక్టివ్‌ బ్యాంకు ఖాతాలు:

డోర్మాంట్ అకౌంట్లు, ఇన్ యాక్టివ్ ఖాతాలను మూసివేయాలని ఆర్బీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రెండేళ్ల కంటే ఎక్కువ లావాదేవీలు లేని బ్యాంకు ఖాతాలను డోర్మాంట్ ఖాతాలుగా గుర్తిస్తారు. అలాంటి ఖాతాలు హ్యాకర్లకు సులభంగా మారతాయి. అక్రమ నగదు బదిలీకి ఈ ఖాతాలను ఉపయోగించే అవకాశం ఉంది. ఇంకా, ఒక సంవత్సరం పాటు ఎలాంటి లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాలను ఇన్‌యాక్టివ్ ఖాతాలుగా గుర్తిస్తారు. వీటిని కూడా అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అలాంటి బ్యాంకు ఖాతాలను జనవరి 1 నుంచి మూసివేయవచ్చు.

ఇది కూడా చదవండి: Success Story: ఇంటర్‌ ఫెయిల్‌.. 7 రోజుల్లో రూ.336 కోట్లు సంపాదించిన వ్యాపారి సక్సెస్‌ స్టోరీ

మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను తెరిచి ఉంటే, ఏదైనా ఒక ఖాతా నిష్క్రియంగా ఉండే అవకాశం ఉంది. అందుకే మీరు అవసరం లేని ఖాతాలను మూసివేయవచ్చు. లేదంటే మీ సాధారణ లావాదేవీల కోసం మీ ఖాతాలన్నింటినీ ఉపయోగించుకునేలా ప్లాన్ చేసుకోవడం మంచిది.

జీరో బ్యాలెన్స్ ఖాతాలు:

నిర్దిష్ట వ్యవధిలోపు బ్యాంకు ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉంటే, అటువంటి ఖాతాలను కూడా మూసివేయాలని RBI నిర్ణయించింది. ప్రజలు తమ బ్యాంకు ఖాతాలను సద్వినియోగం చేసుకునేందుకు ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసేందుకు ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంది. మీ ఖాతా చాలా కాలం పాటు నిష్క్రియంగా ఉంటే అంటే అకౌంట్‌ వినియోగంలో లేకుంటే దాన్ని యాక్టివేట్ చేయవచ్చు. అందుకు బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. మళ్లీ KYC పత్రాలను సమర్పించాలి.

ఇది కూడా చదవండి: మద్యం ప్రియులకు కిక్కిచ్చే వార్త.. వైన్స్‌ షాపులు, బార్ల సమయ వేళల పొడిగింపు!

ఇది కూడా చదవండి: Banks Holiday: కొత్త సంవత్సరం జనవరి 1న బ్యాంకులు మూసి ఉంటాయా..? లేదా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి