AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Finance Tips: బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే నామినీ ఎప్పటిలోగా డబ్బులు విడ్ డ్రా చేయాలి..?

బ్యాంక్ అకౌంట్ ఖాతాదారుడు మరణించిన సమయంలో నామినీ డబ్బులు ఎలా తీసుకోవాలి..? ఎన్ని రోజుల తర్వాత తీసుకోవచ్చు? ఆలస్యమైతే డబ్బులు ఇవ్వరా..? ఇలా చాలా డౌట్లు అందరిలోనూ ఉంటాయి. అయితే ఇందుకు ఆర్బీఐ స్పష్టమైన నిబంధనలు విధించింది. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం.

Finance Tips: బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే నామినీ ఎప్పటిలోగా డబ్బులు విడ్ డ్రా చేయాలి..?
Bank Account
Venkatrao Lella
|

Updated on: Jun 08, 2026 | 8:13 PM

Share

బ్యాంక్ అకౌంట్లకు నామినీని పొందుపర్చడాన్ని ఆర్బీఐ తప్పనిసరి చేసింది. ఇద్దరు నామినీల వరకు చేర్చవచ్చు. దీని వల్ల ఖాతాదారుడు మరణిస్తే సరైన ఆధారాలు చూపించి ఆ అకౌంట్లలోని మనీని నామినీ తీసుకోవచ్చు. ఖాతాదారుడు మరణించాక అకౌంట్లోని నగదు ఎవరికి చెల్లుతుందనేని ఖచ్చితమైన స్పష్టత ఉంటుంది. నామినీని నమోదు చేయడం వల్ల కుటుంబసభ్యులు, బంధువుల మధ్య వివాదాలు కూడా తగ్గుతాయి. అయితే ఇందుకోసం కొన్ని బ్యాంకింగ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఒకవేళ ఖాతాదారుడు మరణిస్తే అకౌంట్లలోని నగదు ఎవరికి వెళుతుంది..? ఎన్ని రోజుల తర్వాత నామినీ డబ్బులు తీసుకోవచ్చు? బ్యాంకింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి? అనే విషయాలు చూద్దాం.

ఎన్ని రోజుల తర్వాత తీసుకోవచ్చు..?

ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఖాతాదారుడు మరణించిన సమయంలో నామినీ నగదు విత్ డ్రా చేసుకోడానికి సంబంధించి ఎలాంటి కాలపరిమితి అనేది లేదు. ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి కాలపరిమితి ఆర్బీఐ విధించలేదు. కొన్నేళ్ల తర్వాత అయినా బ్యాంకును సంప్రదించి నగదును ఉపసంహరించుకోవచ్చు. నామినీ ఆలస్యంగా వచ్చారనే కారణంతో క్లెయిమ్‌ను తిరస్కరించడానికి వీల్లేదు. ఎప్పుడు వచ్చినా నగుదును ఇవ్వాల్సి ఉంటుంది. అయితే చట్టపరమైన సమస్యలు రాకుండా ఉండాలంటే మరణించిన కొద్ది కాలం తర్వాత విత్ డ్రా చేస్తే మంచిదని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

నామినీ తీసుకోకపోతే ఏమవుతుంది..?

ఖాతాదారుడు మరణించిన సమయంలో నామినీ డబ్బును విత్ డ్రా చేయకపోతే ఏమవుతుందనే డౌట్ చాలామందికి ఉంటుంది. 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు తీసుకోకపోతే అకౌంట్ ఇనాక్టివ్ అవ్వడంతో పాటు క్లెయిమ్ చేయనిదిగా మారుతుంది. ఈ ఖాతాల్లోని నగదును రిజర్వ్ బ్యాంక్ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కు వెళుతుంది. ఈ ఫండ్‌కు వెళ్లినా కూడా నామినీ డబ్బులు క్లెయిమ్ చేయవచ్చు. సరైన ఆధారాలు చూపించి నామినీ తీసుకోవచ్చు. నామినీ బ్యాంక్‌కు వెళ్లి క్లెయిమ్ ఫారమ్‌ నింపాలి. ఖాతాదారుడి డెత్ సర్టిఫికేట్, నామినీకి సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ లేదా చెక్ బుక్, సాక్షుల సంతకాలు సమర్పించాలి. అనంతరం బ్యాంక్ అధికారులు పరిశీలించి 15 రోజుల్లోగా నగదును అందిస్తారు. సరైన ఆధారాలు సమర్పిస్తే వెంటనే నగదు అందించే అవకాశం ఉంటుందని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి. బ్యాంక్ అకౌంట్‌కు నామినీని పొందుపర్చడం వల్ల వారసుల మధ్య కూడా ఎలాంటి వివాదాలు ఉండవు. దీని వల్ల కోర్టు సమస్యలు కూడా తగ్గుతాయి. చాలామందికి వీటి గురించి అవగాహన ఉండకపోవడం వల్ల ఖాతాదారుడి చనిపోయిన సమయంలో నగదును విత్ డ్రా చేసుకోలేకపోతున్నారు.

Follow Us
బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే నామినీ ఎప్పటిలోగా డబ్బులు తీసుకోవాలి
బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే నామినీ ఎప్పటిలోగా డబ్బులు తీసుకోవాలి
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా