మార్చి 31వ తేదీతో 2022-23 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. దీంతో బ్యాంకులు అన్ని లెక్కలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31వరకు అన్ని బ్యాంకులు తెరిచి ఉంచాలని ఆదేశించింది. మార్చి 31 2023న సాధారణ పని వేళలు ముగిసే వరకు ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించిన ఓవర్-ది -కౌంటర్ లావాదేవీల కోసం సంబంధిత శాఖలను తెరిచి ఉంచాలని అన్ని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి అన్ని ప్రభుత్వ లావాదేవీలను అదే ఆర్థిక సంవత్సరంలోపు లెక్కించాలని తన ఏజెన్సీ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సిస్టమ్ (RTGS) ద్వారా లావాదేవీలు మార్చి 31 అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. 2022- 23 ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా యానువల్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ ఆ రోజునే ఉంటుంది.
అలాగే ప్రభుత్వ చెక్కులకు సంబంధించి మార్చి 31వ తేదీలోగా ప్రత్యేక క్లియరింగ్ కూడా నిర్వహించాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ అవసరమైన కీలక సూచనలు జారీ చేయనుందని కూడా వెల్లడించింది.
ఐటీ శాఖ ‘ఏఐఎస్ ఫర్ ట్యాక్స్ పేయర్’ పేరుతో కొత్త మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా సమాచార ఆధారిత యాప్. పన్ను చెల్లింపుదారులు వారి వార్షిక సమాచార ప్రకటనలో అందుబాటులో ఉన్న మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. పన్ను చెల్లింపుదారులు వారికి సంబంధించిన మొత్తం పన్ను సంబంధిత సమాచారాన్ని ప్రభుత్వం సేకరించవచ్చు. పన్ను చెల్లింపుదారులు టీడీఎస్ విధించిన, వడ్డీ వసూలు చేసిన, చెల్లించిన డివిడెండ్‌లు, చేసిన షేర్ లావాదేవీలు, చేసిన పన్ను చెల్లింపులు, చేసిన ఆదాయపు పన్ను రీఫండ్‌లు వంటి వాటిపై సమాచారాన్ని పొందవచ్చు. ఇది కాకుండా పౌరులు విదేశీ రెమిటెన్స్‌ల సమాచారాన్ని కూడా పొందుతారు. యాప్‌లో తన లావాదేవీలకు సంబంధించి లేదా అతను దాఖలు చేసిన పన్నుకు సంబంధించి కొంత తప్పు సమాచారం ఉందని వినియోగదారు భావిస్తే అప్పుడు అతను యాప్‌లోనే అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి