Online Payment: వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో మార్పులు!

Online Payment: ఏప్రిల్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ చెల్లింపుల విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న డిజిటల్‌ మోసాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు తీసుకువస్తున్నారు. ఈ మార్పులు చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) సిద్ధమవుతోంది..

Online Payment: వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో మార్పులు!
Online Payment

Updated on: Mar 24, 2026 | 12:12 PM

Online Payment: నేటి తరం డిజిటల్ లావాదేవీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. చాలా మంది ప్రజలు నేరుగా నగదు వాడకుండా యూపీఐ వంటి పద్ధతుల ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు. ఇలాంటి లావాదేవీలు తరచుగా ప్రజలను ప్రమాదంలో పడేస్తున్నాయి. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని ఆన్‌లైన్ చెల్లింపుల వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

ప్రతి డిజిటల్ చెల్లింపు లావాదేవీని కనీసం రెండు వేర్వేరు అంశాల ద్వారా ధృవీకరించాలని ఆర్‌బిఐ ఆదేశించింది. అందుకే ఏప్రిల్ 1 నుండి అమలులోకి రాబోయే మార్పులను పరిశీలిద్దాం.

పాస్‌వర్డ్‌లు లేదా ఇతర భద్రతా చర్యలు:

  • SMS-ఆధారిత OTPలు
  • హార్డ్‌వేర్ టోకెన్‌లు లేదా కార్డులు
  • సాఫ్ట్‌వేర్ ఆధారిత ధృవీకరణ
  • వేలిముద్రలు లేదా ముఖ గుర్తింపు వంటి బయోమెట్రిక్ ధృవీకరణలు
  • అన్ని డిజిటల్ లావాదేవీలకు రెండు-కారకాల ప్రమాణీకరణ తప్పనిసరి

ప్రతి లావాదేవీకి నిర్ధారణ అవసరం. అంటే, ఆన్‌లైన్ చెల్లింపు, బ్యాలెన్స్ చెక్ మొదలైన ఏ సేవకైనా, మీరు ప్రతిసారీ పిన్ నంబర్, పాస్‌వర్డ్ మొదలైన ధృవీకరణ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అటువంటి ప్రమాణాలను పాటించకపోవడం వల్ల మోసం జరిగితే ఆర్థిక సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ప్రమాదాన్ని బట్టి ప్రదేశం, పరికరం, లావాదేవీ మొత్తం వంటి అదనపు తనిఖీలు కూడా అవసరం. అంతర్జాతీయ లావాదేవీలకు కూడా అదనపు ధృవీకరణ అవసరం. గతంలో దేశంలో ఓటీపీ ఆధారిత ధృవీకరణ ఉండేది. కానీ దీనివల్ల ఫిషింగ్ స్కామ్‌లు, సిమ్ స్వాప్ స్కామ్‌లు, మాల్‌వేర్ దాడులు వంటివి జరిగాయి. అందుకే భద్రతను పెంచాలని ఆర్‌బిఐ ఆదేశాలు జారీ చేసింది.

OTPపై నమ్మకం ఎందుకు పోయింది?

గడిచిన కొన్నేళ్లుగా భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రంగం వేగంగా అభివృద్ధి చెందింది. అయితే దీనికి సమాంతరంగా ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్, అనధికార లావాదేవీల కేసులు కూడా గణనీయంగా పెరిగాయి. ఇప్పటివరకు మన వ్యవస్థ ప్రధానంగా ఓటీపీలపైనే ఆధారపడి ఉండేది. అయితే, ఈ సాంకేతిక యుగంలో హ్యాకర్లు ఓటీపీలను దొంగిలించడానికి అనేక కొత్త, ప్రమాదకరమైన పద్ధతులను అభివృద్ధి చేశారు. ఇప్పుడు మీ పొదుపును కేవలం ఒకే ఒక్క సందేశంతో ఆవిరి కావచ్చు. ఈ ప్రమాదాన్ని ముందుగానే ఊహించి కేంద్ర బ్యాంకు మరింత పటిష్టమైన, సురక్షితమైన వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us