AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. ఆటో డెబిట్ చేయాలంటే 24 గంటల ముందే సమాచారం..

ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ కస్టమర్లు అందరికీ ఉపయోగపడేలా మరికొన్ని కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఆటో డెబిట్, ఇ-మాండేట్‌కి సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇక నుంచి బ్యాంకులు ఆటో డెబిట్ చేయాలంటే 24 గంటల ముందు సమాచారం ఇవ్వాలి.

RBI: బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. ఆటో డెబిట్ చేయాలంటే 24 గంటల ముందే సమాచారం..
Rbi
Venkatrao Lella
|

Updated on: Apr 23, 2026 | 7:48 AM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) బ్యాంకింగ్ కస్టమర్ల కోసం మరికొన్ని కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇక నుంచి బ్యాంకులు ఎలా పడితే అలా మీ అకౌంట్ నుంచి మనీ ఆటోడెబిట్ చేసుకోవడానికి వీల్లేదు. కస్టమర్ల భద్రత కోసం ఆర్బీఐ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఇక నుంచి ఆటో డెబిట్ చేయాలంటే కస్టమర్‌కు తప్పనిసరిగా 24 గంటల ముందు ఎస్‌ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత కట్ చేస్తు్న్నారు..? దానికి గల కారణాన్ని తెలపాల్సి ఉంటుంది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, ఇన్యూరెన్స్ ప్రీమియం, కారు లోన్ ఈఎంఐ, హోమ్ లోన్ వంటి వాటన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. బ్యాంకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా ఆటో డెబిట్ చేసుకుంటే కస్టమర్లు ఫిర్యాదు చేయవచ్చు.

రద్దు కూడా చేసుకోవచ్చు

ఆటో డెబిట్ చేసుకోవాలనుకుంటే 24 గంటల ముందు బ్యాంకులు మీకు నోటిఫికేషన్ పంపుతాయి. దీని వల్ల ఈఎంఐకు అవసరమైన డబ్బులను మీరు అకౌంట్లో ఉంచుకుంటారు. దీని వల్ల మీరు లేట్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక ఒకవేళ ఆటో డెబిట్ తప్పు అని భావిస్తే మీరు బ్యాంక్ పంపించే నోటిఫికేషన్ ద్వారా రద్దు చేసుకోవచ్చు. బ్యాంకులు ఇక నుంచి ఇష్టానుసారం కస్టమర్‌కు ముందుగానే సమాచారం ఇవ్వకుండా డబ్బులు ఆటో డెబిట్ చేసుకోకూదు. ముందుగా మీ అనుమతి, మీకు సమాచారం ఇచ్చాకే ఆటో డెబిట్ చేసుకోవాలి. ముందుగానే వచ్చే మెస్సేజ్ ద్వారా వివరాలు ఏదైనా తప్పు ఉంటే బ్యాంకును సంప్రదించవచ్చు. అమౌంట్ తప్పుగా ఉంటే సవరించుకోవచ్చు.

ఎలా ఫిర్యాదు చేయాలి..?

ఒకవేళ 24 గంటల ముందే బ్యాంకులు మీకు ఆటో డెబిట్‌కు సంబంధించి సమాచారం ఇవ్వకపోతే ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు. ఇక వినియోగదారుడి సమ్మతి లేకుండా ఒక్క రూపాయి కూడా బదిలీ చేసుకునే హక్కు బ్యాంకులకు లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అన్ని బ్యాంకులు దీనిని తప్పనిసరిగా పాటించాలని ఆర్బీఐ కొత్త నిబంధనల్లో పేర్కొంది. చాలామంది ఈఎంఐల గురించి మర్చిపోతారు. దీని వల్ల ఈఎంఐ సమాయానికి అకౌంట్‌లో డబ్బులు లేకపోతే బ్యాంకులు బౌన్స్ ఛార్జీలు విధిస్తూ ఉంటాయి. ఇక నుంచి అలాంటి ఛార్జీలు మీకు ఉండవు. బ్యాంకులు ముందే సమాచారం ఇవ్వడం వల్ల మీ అకౌంట్లలో ఆ టైమ్‌కి డబ్బులు ఉంచుకుంటారు. బౌన్స్ ఛార్జీలను బ్యాంకులు భారీగా వసూలు చేస్తున్నాయి. దీనికి ఇప్పటినుంచి చెక్ పడనుందని చెప్పవచ్చు.

Follow Us
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం