రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) సంచలన నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆర్‌బీఐ నిర్ణయంతో రెపోరేటు 4.4 శాతానికి పెరిగింది. రిటైల్ ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్(RBI Governor Shaktikanta Das) తెలిపారు. అమెరికా ఫెడ్ నిర్ణయానికి ముందు ఆర్‌బీఐ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఆర్‌బీఐ నిర్ణయంతో రుణాలపై వడ్డీరేట్లు పెరుగుతాయి. ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచడంతో స్టాక్‌మార్కెట్లు(Stock Market) భారీగా పతనమయ్యాయి. భారత ఆర్ధిక వ్యవస్థపై ఉక్రెయిన్ యుద్ద ప్రభావం తీవ్రంగా ఉందని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు.
ఆర్‌బీఐ నిర్ణయంతో బ్యాంక్ రుణాలు మరింత ప్రియం కానున్నాయి. వ్యవసాయ రుణాలపై వడ్డీభారం కూడా త్వరలో పెరుగుతుంది. హౌసింగ్, కారు, పర్సనల్ లోన్లు 1 నుంచి 1.5 శాతం పెరిగే అవకాశం ఉంది. అయితే బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ పెంచే అవకాశం లేదు.
అమెరికా ఫెడరల్ బ్యాంక్ 2020 తరువాత ఇప్పటివరకు వడ్డీరేట్లను పెంచలేదు. త్వరలో 25-40 బేసిస్ పాయింట్ల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో అమెరికా ఫెడ్ నిర్ణయానికి ముందే ఆర్‌బీఐ కీలక ప్రకటన చేయడం గమనార్హం.
Also Read: Hyundai Motor: హ్యుందాయ్ నుంచి కొత్త క్రెటా మోడల్.. ఫీచర్స్.. ధర వివరాలు
Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజున జోరందుకున్న బంగారం కొనుగోళ్లు.. ఎంత వ్యాపారం జరిగిందంటే..!