LIC IPO: ఐపీవో ప్రారంభమైన 3 గంటల్లోనే LIC షేర్లకు బంపర్ సబ్‌స్క్రిప్షన్.. వివరాలు ఇవే..
LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవో ఈ రోజు ప్రారంభమైన వెంటనే బంపర్ ఓపెనింగ్ వచ్చింది. దేశంలోనే అతిపెద్ద IPO ఉదయం 10 గంటలకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి వచ్చింది.
LIC IPO: ఎల్ఐసీ ఐపీవో ఈ రోజు ప్రారంభమైన వెంటనే బంపర్ ఓపెనింగ్ వచ్చింది. దేశంలోనే అతిపెద్ద IPO ఉదయం 10 గంటలకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి వచ్చింది. ఐపీవో ఓపెన్ అయిన తరువాత కేవలం 3 గంటల్లోనే 41% సబ్‌స్క్రయిబ్ అయింది. పాలసీదారుల కోసం రిజర్వు చేయబడిన భాగం (మొత్తం బ్యాలెన్స్‌లో 10%) ఓవర్ సబ్‌స్క్రైబ్ పూర్తయింది. అంటే ఈ కోటా కింద 1.39 సార్లు బిడ్డింగ్ దాఖలయ్యాయి. 16 కోట్ల 20 లక్షల 78 వేల 67 షేర్లను విక్రయానికి ఎల్ఐసీ ఉంచింది. ఇప్పటి వరకు 5 కోట్లకు పైగా షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఉద్యోగుల కోసం 71% రిజర్వ్ షేర్, 43% రిటైల్ ఇన్వెస్టర్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఇన్వెస్టర్లకు మే 9 వరకు ఐపీవోలో బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) IPO ఈరోజు ప్రారంభమైంది. ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటాను ఐపీవో ద్వారా ప్రభుత్వం విక్రయిస్తోంది. 9 మే 2022 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది. LIC IPO లో రిటైల్ పెట్టుబడిదారులు కనీసం ఒక లాట్ అంటే 15 షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లు రూ.45 తగ్గింపు తర్వాత కనీసం రూ.13,560 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠ పరిమితి 14 లాట్లు, అంటే 210 షేర్లు. పెట్టుబడిదారులు గరిష్ఠంగా రూ.1,89,840 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అదేవిధంగా, పాలసీదారులు రూ.60 తగ్గింపు తర్వాత కనిష్టంగా రూ.13,335 అలాగే గరిష్ఠంగా రూ.1,86,690 పెట్టుబడి పెట్టవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Hyundai Motor: హ్యుందాయ్ నుంచి కొత్త క్రెటా మోడల్.. ఫీచర్స్.. ధర వివరాలు