Paytm: పేటీఎంకు ఆర్బీఐ ఎదురుదెబ్బ.. వారు పేటీఎం సేవలు పొందలేరు

పేమెంట్స్ బ్యాంక్‌పై మాత్రమే పరిమితి విధించింది. అన్ని ఇతర యూపీఐ లావాదేవీ సేవలు, పేటీఎంయాప్‌లో అందుబాటులో ఉన్నాయి. పేటీఎంని స్కాన్ చేయడం ద్వారా చెల్లింపు చేయవచ్చు. విద్యుత్, వాటర్ తదితర బిల్లులను సాధారణంగా చెల్లించవచ్చు. 29 ఫిబ్రవరి 2024 తర్వాత ఏదైనా కస్టమర్ ఖాతా, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్, వాలెట్, ఫాస్టాగ్,ఎన్‌సీఎంసీ కార్డ్ మొదలైన వాటిలో వడ్డీ,

Paytm: పేటీఎంకు ఆర్బీఐ ఎదురుదెబ్బ.. వారు పేటీఎం సేవలు పొందలేరు
Paytm

Updated on: Jan 31, 2024 | 7:00 PM

వివిధ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) పలు ఆంక్షలు విధించింది. కొత్త కస్టమర్లను అంగీకరించవద్దని, కొత్త డిపాజిట్ పొందకూడదని సూచించింది. ఫిబ్రవరి 29 తర్వాత కొత్త డిపాజిట్లను స్వీకరించకుండా, క్రెడిట్ లావాదేవీలను నిర్వహించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను నిషేధించింది.

అయితే ఇది Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై మాత్రమే పరిమితి విధించింది. అన్ని ఇతర యూపీఐ లావాదేవీ సేవలు, పేటీఎంయాప్‌లో అందుబాటులో ఉన్నాయి. పేటీఎంని స్కాన్ చేయడం ద్వారా చెల్లింపు చేయవచ్చు. విద్యుత్, వాటర్ తదితర బిల్లులను సాధారణంగా చెల్లించవచ్చు. 29 ఫిబ్రవరి 2024 తర్వాత ఏదైనా కస్టమర్ ఖాతా, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్, వాలెట్, ఫాస్టాగ్, ఎన్‌సీఎంసీ కార్డ్ మొదలైన వాటిలో వడ్డీ, క్యాష్‌బ్యాక్ లేదా రీఫండ్ కాకుండా ఎలాంటి డిపాజిట్, క్రెడిట్ లావాదేవీ లేదా టాప్ అప్ అనుమతించబడదు.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కి ఈ పరిమితి ఎందుకు?

ఇవి కూడా చదవండి

ఆడిటర్లు పేటీఎం బ్యాంక్‌ను ఆడిట్ చేశారు. బ్యాంకింగ్ నిబంధనలను సక్రమంగా పాటించడం లేదని ఆడిటింగ్‌లో వెల్లడైంది. ఇది రెండేళ్ల క్రితం జరిగింది. మార్చి 2022 నెలలో కొత్త కస్టమర్లను స్వీకరించకుండా పేటీఎంపేమెంట్స్ బ్యాంక్‌ని ఆర్బీఐ పరిమితం చేసింది. ఇప్పుడు ఆర్బీఐ ఫిబ్రవరి 29 తర్వాత ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్, ఎన్‌సీఎంసీ కార్డ్ మొదలైనవాటిని పంపడం లేదా టాప్ అప్ చేయడం సాధ్యం కాదని తెలిపింది.

అయితే, ఇంతకుముందు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు క్యాష్‌బ్యాక్, వడ్డీ, రీఫండ్ మొదలైనవాటిని డిపాజిట్ చేయడానికి ఎటువంటి ఆటంకం లేదు. పేమెంట్స్ బ్యాంక్‌లో ఖాతాదారులు తమ నిధులను పూర్తిగా విత్‌డ్రా చేసుకునేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని ఆర్‌బీఐ సూచించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి