Ratan Tata: అధికారిక లాంఛనాలతో ముగిసిన రతన్‌ టాటా అంత్యక్రియలు

|

Oct 10, 2024 | 7:24 PM

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా అంత్యక్రియలు ముంబయిలోని వర్లి శ్మశాన వాటికలో ముగిశాయి. మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు నిర్వహించింది. మహారాష్ట్ర సర్కార్ అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్‌ షా హాజరయ్యారు...

Ratan Tata: అధికారిక లాంఛనాలతో ముగిసిన రతన్‌ టాటా అంత్యక్రియలు
Follow us on

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా అంత్యక్రియలు ముంబయిలోని వర్లి శ్మశాన వాటికలో ముగిశాయి. మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు నిర్వహించింది. మహారాష్ట్ర సర్కార్ అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్‌ షా హాజరయ్యారు.

రతన్‌ టాటా అంతర్జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పి లక్షలాది మందికి ఉపాధి కల్పించి, తన సంపాదనలో 60 శాతానికిపైగా పేదల సంక్షేమానికి ఖర్చు పెట్టారు. రెండు దశాబ్దాలకు పైగా టాటా గ్రూప్‌నకు అధిపతిగా ఉన్న రతన్ ఇటీవల తీవ్ర అనారోగ్యంతో దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రతన్ టాటా, ఆయన తమ్ముడు జిమ్మీ ముంబయి డౌన్‌టౌన్‌లో నివసించే అమ్మమ్మ నవాజ్‌బాయి దగ్గర పెరిగారు. ఆయన పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు వేల సంఖ్యలో నేతలు, ప్రముఖులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. ప్రముఖుల రాజకీయ నేతలు, అధికారులు కడసారిగా నివాళులు అర్పించారు.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి