Indian Railways: వందేభారత్‌ కాదు.. ఇండియన్‌ రైల్వేస్‌కు ఏకైక రారాజు ఈ ట్రైనేనట!

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో మన ఇండియన్ రైల్వేస్ కూడా ఒకటి. బ్రిటిష్ కాలంలో మొదలైన ఈ రైల్వేస్ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఇప్పుడు హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ వరకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇండియన్ రైల్వేస్‌కు 'రాజు'గా వందే భారత్ ట్రైనే అని అనుకుంటారు. కానీ దశాబ్దాల క్రితమే ఆ ఘనత మరో ట్రైన్ తన ఖాతాలో వేసుకుంది. ఇంతకీ ఆ ట్రైన్ ఏదో తెలుసుకుందాం పదండి.

Indian Railways: వందేభారత్‌ కాదు.. ఇండియన్‌ రైల్వేస్‌కు ఏకైక రారాజు ఈ ట్రైనేనట!
The True King Of Indian Railways

Updated on: Aug 31, 2026 | 5:46 PM

ప్రస్తుతం భారత రైల్వే వ్యవస్థలో అత్యాధునిక హంగులతో, హైస్పీడ్‌తో నడిచే ట్రైన్ ఏదైనా ఉందంటే.. అది వందేభారత్ ఎక్స్‌ప్రెస్. అయితే ఈ ట్రైన్‌నే ఇండియన్ రైల్వేస్‌కు రారాజు అనుకుంటారు అందరూ. కానీ కొన్ని సంవత్సరాల క్రితమే ఈ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్న ట్రైన్ రాజధాని ఎక్స్‌ప్రెస్. అవును, 1969 మార్చి 3న న్యూఢిల్లీ – హౌరా మధ్య ప్రారంభమైన ఈ ట్రైన్, ఆ రోజుల్లోనే రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని 17 గంటలకు తగ్గించి భారతీయ రైల్వేకు ఏకైక రారాజుగా నిలిచింది.

మొదటి ప్రయోగం విజయవంతం కావడంతో ఈ ట్రైన్‌ను ముంబై, చెన్నై, బెంగళూరు, గౌహతి వంటి ప్రధాన నగరాలతో పాటు రాష్ట్రాల రాజధానులను దేశ రాజధాని ఢిల్లీతో అనుసంధానించారు. ప్రస్తుతం దేశంలో 20కి పైగా మార్గాలను కలుపుతూ ఈ ట్రైన్ సేవలను అందిస్తోంది. ఈ ట్రైన్లు ప్రయాణించే కొన్ని మార్గాల్లో గంటకు 130 నుండి 140 కి.మీ వేగంతో పరుగులు తీస్తాయి. ఇవి చాలా తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని చేరుకోవడానికి కేవలం స్పీడ్ మాత్రమే కాదు.. ట్రాక్‌లపై సిగ్నలింగ్ వ్యవస్థ కూడా చాలా కీలకంగా పనిచేస్తుంది.

దేశంలోనే మొట్టమొదటి పూర్తి ఏసీ రైలు

మిగతా ట్రైన్‌లతో పోల్చుకుంటే రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దేశంలోనే మొదటి పూర్తి ఏసీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కూడా ఇదే. ఈ ట్రైన్‌లో ప్రయాణికులకు సౌకర్యవంతంగా శుభ్రమైన కోచ్‌లు, రుచికరమైన భోజనం, బెడ్‌రోల్స్, ప్రశాంతమైన వాతావరణం లగ్జరీ ఫీల్‌ను ఇచ్చేలా ఉంటాయి. అందుకే ఈ ట్రైన్‌ను చాలా మంది ప్రయాణికులు ఇష్టపడతారు.

ఎప్పటికీ ప్రత్యేకమే!

మన భారతీయ రైల్వేలో శతాబ్ది, దురంతో, తేజస్, మహారాజా ఇలా ఎన్నో ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లు ఉన్నప్పటికీ.. స్పీడ్, కంఫర్ట్, ప్రయాణికులకు లగ్జరీ ఫీల్‌ను అందించే ప్రత్యేకతను మాత్రం రాజధాని ఎక్స్‌ప్రెస్ మాత్రమే సొంతం చేసుకుంది. అందుకే అప్పటికీ ఇప్పటికీ.. భారతీయ రైల్వేకి అసలైన రారాజు అంటే రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైనే గుర్తుకు వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us