Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో ఎన్నడూ లేని కొత్త రూల్స్.. కేవలం వీరికి మాత్రమే ఎంట్రీ.. ప్రయాణం చేయాలంటే అది తప్పనిసరి..

ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లను అప్‌గ్రేడ్ చేస్తూ వందే భారత స్లీపర్ రైళ్లను భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకొస్తోంది. జనవరి 17వ తేదీన తొలి రైలును ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. మొదటి వందే భారత్ స్లీపర్ రైలును హౌరా-గువహతి మధ్య ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో ఎన్నడూ లేని కొత్త రూల్స్..  కేవలం వీరికి మాత్రమే ఎంట్రీ.. ప్రయాణం చేయాలంటే అది తప్పనిసరి..
Vande Bharat Sleeper

Updated on: Jan 12, 2026 | 2:40 PM

ఈ నెల 17న హౌరా-గువహతి మధ్య వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రూట్‌లో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ దాదాపు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడవనుంది. రాత్రి పూట ప్రయాణం చేసేవారు ఎలాంటి కుదుపులు, శబ్దాలు లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. కేవలం రాత్రిపూట ప్రయాణికుల కోసమే ఈ రైళ్లను రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. ఈ తొలి వందే భారత్ స్లీపర్ రైలు ఈశాన్య, తూర్పు భారతదేశం మధ్య కనెక్టివిటీని మెరుగుపర్చనుంది. పశ్చిమబెంగాల్‌లోని మాల్డా నుంచి ఈ మొదటి రైలును మోదీ ప్రారంభించనున్నారు.

నో వీఐపీ కోటా

సాధారణంగా రైళ్లల్లో వీఐపీ కోటా ఉంటుంది. ఈ కోటాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అత్యవసర సమయాల్లో ప్రయాణించవచ్చు. వారి కోసం ప్రత్యేక సీట్లు అన్నీ రైళ్లల్లో రిజర్వుడ్ చేసి ఉంటాయి. కానీ వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో వీఐపీలకు ప్రత్యేక కోటా ఏం లేదు. వీఐపీలు ప్రయాణించడానికి అత్యవసర కోటా ఇందులో లేదు. దీంతో సాధారణ ప్రయాణికుల్లాగే వీఐపీలు ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే సీనియర్ రైల్వే అధికారులు కూడా రైల్వే పాస్‌లను ఉపయోగించి ప్రయాణించడానికి కుదరదు. రైల్వే ఉన్నతాధికారులు కూడా టికెట్లు తీసుకుని సాధారణ ప్రయాణికులతో పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. కేవలం సాధారణ ప్రజలకు మాత్రమే వందే భారత్ స్లీపర్ సేవలు అందుబాటులో ఉంచేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

కఠిన టికెట్ల నిబంధనలు

ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో కఠినతరమైన టికెట్ల నిబంధనలను జారీ చేశారు. కేవలం టికెట్ కన్ఫార్మ్ అయినవారు మాత్రమే ఇందులో ప్రయాణించడానికి వీలవుతుంది. వెయిటింగ్ లిస్ట్, ఆర్‌ఏసీ టికెట్లకు అనుమతి ఉండదు. దీంతో వల్ల ప్రయాణికులు బెర్త్‌లను షేర్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. దీని వల్ల సైడ్ లోయర్ సీట్లలో ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. రాత్రిపూట ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

మెరుగైన దుప్పట్లు, కవర్లు

ఇక బెడ్ రోల్ చాలా లగ్జరీగా ఉంటుంది. బెడ్ సీట్లు, కవర్లు మెరుగైనవి అందిస్తారు. సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో బెడ్ రోల్ మరింత నాణ్యతతో కూడి ఉంటుంది. ఇక రైళ్లల్లోని సిబ్బంది ప్రత్యేక యూనిఫాం ధరించడంతో పాటు స్థానిక వంటకాలను ప్రయాణికులకు వడ్డిస్తారు. ఈ రైళ్లల్లో మొత్తం 11 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ఐదు థర్డ్ ఏసీ, నాలుగు సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ క్లాస్ ఏచీ ఉంటుంది. మొత్తం 823 సీట్లు ఉంటాయి. థర్డ్ ఏసీలో 611, సెకండ్ ఏసీలో 188, ఫస్ట్ ఏసీలో 24 బెర్త్‌లు ఉంటాయి.