Railways: ఆ ఒక్క అమ్మాయి కోసమే ఏళ్ల తరబడి రైలు ఆగింది.. ఆ స్టేషన్‌ స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

Railways: చివరికి ఆ అమ్మాయి మార్చి 2016లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అలాగే అదే రోజున రైలు చివరిసారిగా ఈ స్టేషన్‌లో ఆగింది. ఆ తర్వాత ఈ స్టేషన్ మూసివేశారు. ఈ కథ జపాన్ రైలు సేవ మానవీయ కోణాన్ని చూపిస్తుంది..

Railways: ఆ ఒక్క అమ్మాయి కోసమే ఏళ్ల తరబడి రైలు ఆగింది.. ఆ స్టేషన్‌ స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

Updated on: Aug 24, 2025 | 5:14 PM

Railways: జపాన్‌లోని హక్కైడో ప్రాంతంలో క్యు-షిరాటకి స్టేషన్ అనే చిన్న స్టేషన్ ఉంది. ఈ స్టేషన్‌ను సంవత్సరాలుగా చదువుకోవాలనుకునే అమ్మాయి కోసమే ఈ స్టేషన్‌ తెరిచి ఉంచారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. జపాన్‌లో రైలు నెట్‌వర్క్‌ను నిర్వహించే సంస్థ జపాన్ రైల్వేస్. ఆ అమ్మాయి చదువు పూర్తి చేసే వరకు స్టేషన్‌ను తెరిచి ఉంచాలని నిర్ణయించింది ఇక్కడి రైల్వే అధికారులు.

Washing Powder Nirma: ఒకప్పుడు దేశాన్ని ఏలిన ‘నిర్మా’ ఇప్పుడు ఏమైపోయింది..? ఒక తప్పు వల్ల కనుమరుగు

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. 2013 ప్రాంతంలో ఈ స్టేషన్ నుండి దాదాపుగా ఒక్క ప్రయాణికుడూ ప్రయాణించడం లేదని రైల్వేలు గమనించాయి. ప్రయాణికుల కొరత, సరుకు రవాణా రైలు సర్వీసులు మూసివేయడం వల్ల జపాన్ రైల్వేలు ఈ స్టేషన్‌ను మూసివేయాలని నిర్ణయించాయి. ప్రయాణికుల సంఖ్య చాలా తగ్గింది. అలాగే స్టేషన్ దాదాపు నిర్మానుష్యంగా మారింది. సాధారణంగా ఇటువంటి పరిస్థితిలో స్టేషన్ మూసివేస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. కానా హరాడా అనే ఉన్నత పాఠశాల బాలిక ప్రతిరోజూ ఈ స్టేషన్ నుండి చదువుకోవడానికి వెళ్లేది. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు జపాన్ రైల్వేలు ఈ స్టేషన్‌ను చాలా సంవత్సరాలుగా ఈ అమ్మాయి చదువుల కోసం మాత్రమే తెరిచి ఉంచాయి. ఆమె పాఠశాల సమయాల ప్రకారం రైలు టైమ్‌టేబుల్ కూడా నిర్ణయించాయి. అంటే ఆమెను ఉదయం పాఠశాలకు తీసుకెళ్లి సాయంత్రం తిరిగి తీసుకురావడం.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Traffic Challan Rule: ఇక ట్రాఫిక్‌ రూల్స్‌ మరింత కఠినం.. చెల్లించని చలాన్‌లపై మరిన్ని ఛార్జీలు!

ఈ స్టేషన్ కనా హరాడాకు జీవనాధారంగా ఉంది. చివరికి ఆ అమ్మాయి మార్చి 2016లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అలాగే అదే రోజున రైలు చివరిసారిగా ఈ స్టేషన్‌లో ఆగింది. ఆ తర్వాత ఈ స్టేషన్ మూసివేశారు. ఈ కథ జపాన్ రైలు సేవ మానవీయ కోణాన్ని చూపిస్తుంది. ఇక్కడ లాభం కంటే మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజలు ఈ నిర్ణయాన్ని విద్య, సుపరిపాలనకు ఉదాహరణగా భావిస్తారు.

 

ఇది కూడా చదవండి: Traffic Challan: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్ మొత్తంలో 75 శాతం మాఫీ

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి