
భారతదేశంలోని అతిపెద్ద మద్యం కంపెనీలలో ఒకటైన రాడికో ఖైతాన్ లిమిటెడ్. 1999 కార్గిల్ యుద్ధంలో వీర సైనికులకు నివాళిగా, వారిని స్పూర్తిగా తీసుకుని ఈ కంపెనీ నుంచి స్పిరిట్ ఆఫ్ విక్టరీ 1999 ప్యూర్ మాల్ట్ విస్కీని పరిచయం చేస్తోంది. ఈ విస్కీని తీసుకురావడానికి కారణాలు కూడా లేకపోలేదు. కార్గిల్ యుద్ధంలో సైనికులు పోరాడిన తీరు, వారి ధైర్య సహాసాలను గుర్తించి మంచి నాణ్యతతో కూడిన ఈ స్పిరిట్ ఆఫ్ విక్టరీ ప్రీమియం బ్రాండ్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది కంపెనీ. అభివృద్ధి చెందుతున్న ఈ రాడికో ఖైతాన్ లిమిటెడ్ కంపెనీ స్పిరిట్ ఆఫ్ విక్టరీ 1999 ప్యూర్ మాల్డ్ విస్కిని తీసుకువచ్చింది. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. విక్రయించే ప్రతి సీసాపై, కంపెనీ ఆర్జించిన ఆదాయంలో కొంత భాగాన్ని భారత సాయుధ దళాల సంక్షేమ నిధులకు అందజేస్తానని కంపెనీ స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఈ బ్రాండ్‌ను ఉత్తరప్రదేశ్, హర్యానాలో అందుబాటులోకి తీసుకువచ్చింది. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలకు విస్తరింపజేయనున్నట్లు రాడికో ఖైతాన్ కంపెనీ వెల్లడించింది. ఈ స్పిరిట్ ఆఫ్ విక్టరీ విస్కీ ధర 5,000 రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా రాడికో ఖైతాన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమర్ సిన్హా మాట్లాడుతూ.. 1999 కార్గిల్ యుద్ధంలో సైనికులు పోరాడిన తీరును స్పూర్తిగా తీసుకుని అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. వారికి నివాళిగా తీసుకువచ్చిన ఈ బ్రాండ్‌ను మంచి నాణ్యతతో తయారు చేసినట్లు చెప్పారు. స్పిరిట్ ఆఫ్ విక్టరీ 1999 ప్యూర్ మాల్ట్ విస్కీ మా సాహసోపేత సైనికులకు నివాళి, ఇప్పటికే దిగ్గజ బ్రాండ్‌లను కలిగి ఉన్న మా బ్రాండ్ సృష్టి సామర్థ్యాలకు నిదర్శనం అని అన్నారు.
అలాగే ఈ కంపెనీ నుంచి పలు బ్రాండ్లు కూడా ఉన్నాయని చెప్పారు. రాంపూర్ ఇండియన్ సింగిల్ మాల్ట్, సంగమ్ వరల్డ్ మాల్ట్, అలాగే రాయల్ రణతంబోర్ హెరిటేజ్ కలెక్షన్ విస్కీలు వంటివి ఉన్నాయని అన్నారు. ఈ ఉత్పత్తులు మంచి నాణ్యతతో కూడినవిగా ఉన్నాయని, సైనికులు మన దేశానికి చేసిన కృషి, వారి ధైర్య సహాసాలకు గుర్తింపుగా తీసుకువచ్చినట్లు వెల్లడించారు..
మాల్ట్ విస్కీ అంటే ఏమిటి?
ప్యూర్ మాల్ట్. దీనిని బ్లెండెడ్ మాల్ట్ అని కూడా పిలుస్తారు. ఇది సాంప్రదాయ పాట్ స్టిల్స్‌లో రెండుసార్లు స్వేదనం చేసిన వివిధ సింగిల్ మాల్ట్‌లను కలపడం ద్వారా తయారైన ఒక రకమైన విస్కీ. ఈ సింగిల్ మాల్ట్‌లు ఓక్ బారెల్స్‌లో పరిపక్వత చెందుతాయి.
స్పిరిట్ ఆఫ్ విక్టరీ రేంజ్ ఉత్పత్తుల గురించి..
రాడికో ఖైతాన్ నుండి స్పిరిట్ ఆఫ్ విక్టరీ శ్రేణి 1965, 1999 కార్గిల్ యుద్ధం, 1971 యుద్ధంతో సహా మూడు ముఖ్యమైన ఇండో-పాక్ యుద్ధాల విజయానికి నివాళులర్పించే ఉత్పత్తుల శ్రేణిగా నిలుస్తుంది. రాడికో ఖైతాన్ మన దేశాన్ని విరోధులకు వ్యతిరేకంగా, రక్షించే వారికి మద్దతు ఇవ్వడం, గౌరవించడంలో తన నిబద్ధతను ప్రదర్శించింది. ఈ ఉత్పత్తులలో 1965 స్పిరిట్ ఆఫ్ విక్టరీ రమ్, 1965 స్పిరిట్ ఆఫ్ విక్టరీ లెమన్ డాష్ రమ్, స్పిరిట్ ఆఫ్ విక్టరీ 1999 ప్యూర్ మాల్ట్ ఉన్నాయి.
1965 స్పిరిట్ ఆఫ్ విక్టరీ రమ్ గురించి
1965 స్పిరిట్ ఆఫ్ విక్టరీ ప్రీమియమ్ XXX రమ్‌తో 2017లో ప్రారంభమైనప్పటి నుండి, స్పిరిట్ ఆఫ్ విక్టరీ బ్రాండ్ ప్రీమియం డార్క్ రమ్ సెగ్మెంట్‌లో బలంగా ప్రతిధ్వనించింది. దీని తర్వాత 2020లో 1965 స్పిరిట్ ఆఫ్ విక్టరీ లెమన్ డాష్ ప్రీమియం ఫ్లేవర్డ్ రమ్ వచ్చింది. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1965 స్పిరిట్ ఆఫ్ విక్టరీ బ్రాండ్, దాని డార్క్ అండ్ వైట్ రమ్ 1 మిలియన్ బాటిళ్లను అధిగమించి గణనీయమైన మైలురాయిని చేరుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి