నోయిడాలో నిర్వహిస్తున్న ఆటో ఎక్స్ పో 2023లో కొన్ని దేశీయ, విదేశీ కంపెనీలు తమ కార్లను, బైక్ లను మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. అలాగే వాటిని లాంచ్ చేస్తూ వాటి ఫీచర్స్ ను కంపెనీ ప్రతినిధులు వివరిస్తున్నారు. గతేడాది నవంబర్ లో భారత్ లో అమ్మకాలు ప్రారంభించిన చైనా ఆధారిత క్యూజే మోటర్స్ కొత్త బైక్ ను మార్కెట్ లో లాంచ్ చేసింది. ఎస్ఆర్ వీ 300 పేరుతో లాంచ్ చేసిన ఈ బైక్ రాయల్ ఎన్ ఫీల్డ్ మెటోర్ 350, హోండా హ్నేస్ సీబీ 350 బైక్స్ కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఎస్ఆర్ వీ 300 బైక్ సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకోవడం గ్యారెంటీ అని కంపెనీ ప్రతినిధులు చెబుతన్నారు. ఈ బైక్ లో ఉన్న అధునాతన ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.
ఎస్ఆర్ వీ 300 బైక్ రెండు సిలిండర్లతో వస్తుంది. అలాగే ఈ బైక్ ధర రూ3.49 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. 164 కేజీల బరువుతో చూడడానికి భారీ ఆకారంలో ఈ బైక్ వినియోగదారులను ఆకర్షిస్తుంది. అలాగే 13.5 లీటర్ల కెపాసిటీతో వచ్చే ఈ బైక్ ట్యాంక్ చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటుంది. వి-ట్విన్ లిక్వ్ డ్ కూల్డ్ మోటర్, ఆరు గేర్లతో వస్తుంది. అయితే ఈ బైక్ 9000 ఆర్ పీఎం వద్ద 30.3 బీహెచ్ పీ, 5000 ఆర్ పీఎం వద్ద 26 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ బైక్ 15-16 అంగుళాల ఎలాయ్ వీల్స్ తో డిస్క్ బ్రేక్ తో వస్తుంది. అయితే ఈ బైక్ ను ఎప్పటి నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందో మాత్రం కంపెనీ ప్రతినిధులు పేర్కొనలేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..