
భారతదేశపు ఎలక్ట్రిక ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజాల్లో ఒకటైన ప్యూర్ ఈవీ..తమ విలువైన కస్టమర్ల కోసం గొప్ప ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ‘ప్యూర్ పర్ఫెక్ట్ 10’ అనే రిఫరల్ ప్రోగ్రాంను ఆవిష్కరించింది. ఇందులో వినియోగదారులను ఆకట్టుకునే క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
శివరాత్రి, హోళీ, ఉగాది, రంజాన్ సహా పండుగల సీజన్ నేపథ్యంలో వినియోగదారులకు మరింత చేరవయ్యేందుకు దేశవ్యాప్తంగా ఎలక్ట్రీక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఆఫర్ ఎంతగానో దోహదపడనుంది.
ఈ ప్యూర్ పర్ఫెక్ట్ 10 రిఫరల్ ప్రోగ్రాం అనేది ప్రస్తుత ప్యూర్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులందరికీ, 2025 మార్చి 31లోగా ప్యూర్ ఈవీ వాహనాన్ని కొనుగోలు చేసే కొత్త కస్టమర్లకు వర్తించనుంది. అలాగే ఆయా ఔట్‌లెట్స్‌లో స్టాక్స్ ఉండేంతవరకు కూడా ఆఫర్ వర్తించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కీము కింద ప్యూర్ ఈవీ స్కూటర్‌ను కొనుగోలు చేసేలా తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను రిఫర్ చేసే కస్టమర్లు రూ. 40,000 వరకు క్యాష్‌బ్యాక్ రివార్డులు పొందవచ్చని కూడా వెల్లడించింది.
ప్రస్తుత, కొత్త ప్యూర్ ఈవీ వినియోగదారులకు వారి రిజిస్టర్డ్ వాట్సాప్ నంబరుపై 10 రిఫరల్ కోడ్‌లు వస్తాయి. రిఫర్ చేసిన వారు ప్యూర్ ఈవీ ని కొనుగోలు చేస్తే అలాంటి ప్రతి లావాదేవీకి గాను రిఫరర్‌కి రూ.4,000 క్యాష్‌బ్యాక్ వోచర్‌లు లభించనున్నాయి. అయితే ఒక్కో రిఫరర్ గరిష్టంగా పది మంది వరకు కొత్త కొనుగోలుదార్లకు ఇది వర్తిస్తుంది.
పర్యావరణహిత మొబిలిటీ లక్ష్య సాధనకు దోహదపడుతూనే రిఫరల్స్ ఇవ్వడం ద్వారా ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ఇన్సెంటివ్‌లతో ప్రయోజనం కూడా పొందవచ్చని ప్యూర్ సహా వ్యవస్థాపకుడు, సీఈవో రోహిత్ వదేరా తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా ఈవీల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించగలదని ఆశిస్తున్నామని అన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి