EV Fire: ఛార్జింగ్ చేస్తుండగా మంటలు చెలరేగిన ప్యూర్ EV ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎక్కడంటే..

|

Jun 17, 2022 | 6:38 PM

EV Fire: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగుతున్న మరో ఘటన తాజాగా నమోదైంది. ఇది శుక్రవారం గుజరాత్‌లో చోటుచేసుకుంది.

EV Fire: ఛార్జింగ్ చేస్తుండగా మంటలు చెలరేగిన ప్యూర్ EV ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎక్కడంటే..
Ev Fire
Follow us on

EV Fire: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగుతున్న మరో ఘటన తాజాగా నమోదైంది. ఇది శుక్రవారం గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఛార్జ్ చేస్తున్న సమయంలో ప్యూర్ EV.. EPluto 7G ఈ-స్కూటర్ అగ్నికి ఆహుతైంది. వాహనం మంటల్లో చిక్కుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో.. స్కూటర్ మంటల్లో కాలుతూ కనిపిస్తోంది. ఆ సమయంలో ఈ-స్కూటర్‌ ఛార్జింగ్ కోసం ప్లగ్ చేసి ఉంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇది ప్యూర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు సంబంధించిన ఐదవ దుర్ఘటన. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ప్యూర్ EV ఇంకా ప్రకటన విడుదల చేయలేదు.

ఇప్పటి వరకు నాలుగు ప్యూర్ EV ఈ-స్కూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. నాల్గవ ప్రమాద ఘటన గత నెలలో హైదరాబాద్ నుంచి నివేదించబడింది. ప్యూర్ EV ఏప్రిల్‌లో 2,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేసింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో మంటలు, పేలుళ్లు ఇప్పటికీ కొనసాగుతున్నందున.. ప్రభుత్వం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం EV బ్యాటరీలకు BIS ప్రమాణాలను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  ఈ రూల్స్ తరువాత దశలో నాలుగు చక్రాల వాహనాలకు సైతం అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల కోసం BIS ప్రమాణాల కింద “పరిమాణం, కనెక్టర్‌లు, స్పెసిఫికేషన్, సెల్‌ల కనీస నాణ్యత, బ్యాటరీ సామర్థ్యం”ని పరిశీలిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.