Provident Fund: పీఎఫ్ వల్ల ఎన్నో ఉపయోగాలుంటాయి. చాలా మందికి కొన్ని విషయాలు తెలిసి ఉండవు. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సబ్‌స్క్రైబర్లు అందరికీ పీఎఫ్ అకౌంట్ సర్వీసులు అందిస్తుంది. పీఎఫ్ ఖాతా కలిగిన వారు పలు రకాల ప్రయోజనాలు పొందవచ్చు. వీటిల్లో రుణ సౌకర్యం కూడా ఒకటి. పీఎఫ్ ఖాతాదారులు సులభంగానే రుణం తీసుకోవచ్చు. అయితే హోమ్ లోన్ ఈఎంఐ కట్టేందుకు పీఎఫ్ డబ్బులను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎల్‌ఐసీ ప్రీమియం కూడా చెల్లించొచ్చు. పీఎఫ్ ఖాతాదారుల సర్వీస్ ప్రాతిపదికన ఈ బెనిఫిట్స్ మారతాయని గమనించాల్సి ఉంటుంది.
రుణ సౌకర్యం మాత్రమే కాకుండా పీఎఫ్ అకౌంట్ ఉన్న వారు వివిధ రకాల ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈడీఎల్‌ఐ స్కీమ్ కింద రూ.7 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఈ ఇన్సూరెన్స్‌కు పీఎఫ్ ఖాతాదారులు ఎలాంటి ప్రీమియం కట్టనవసరం లేదు. అయితే ఇంకా డబ్బులు అవసరమై ఉంటే పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి పెన్షన్ కూడా వస్తుంది. ఇంకా హోమ్ లోన్ కట్టేందుకు పీఎఫ్ ఖాతా నుంచి 90 శాతం డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంకా పీఎఫ్ ఖాతాలో పెట్టే డబ్బులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇలా పీఎఫ్ వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. కానీ నిబంధనలను అనుసరించే ఈ ప్రయోజనాలు పొందవచ్చు.