ప్రస్తుత రోజుల్లో పన్నులను ఆదా చేయడం అనేది పన్ను చెల్లింపుదారులకు పెద్ద ప్రహసనంగా మారుతుంది. పన్ను భారాన్ని తగ్గించడానికి ఆదాయపు పన్ను చట్టంలో వివిధ పన్ను ఆదా ఎంపికలు నిర్దిష్ట షరతులతో అందుబాటులోఉన్నాయి. ముఖ్యంగా బహుమతుల పన్ను(గిఫ్ట్ ట్యాక్స్) భారం నుంచి తప్పించుకునేందుకు నిపుణులు చిన్న చిట్కా చెబుతున్నారు. సాధారణంగా పండుగల సమయంలో మనకు కావాల్సిన వారికి బహుమతులు ఇవ్వడం మన సంప్రదాయంలో భాగం. అయితే ఇలాంటి బహుమతుల వల్ల పన్ను భారం కూడా అధికంగా ఉంటుంది. మీరు బహుమతిగా ఇచ్చిన సొమ్మును ఆ వ్యక్తి పెట్టుబడి పెడితే దానిపై వచ్చే వడ్డీకు మీరు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు ఓ భర్త భార్యకు రూ.6,00,000 బహుమతిగా ఇస్తే ఆమె దానిని ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెడితే కనుక ఓ రూ. 5,000 వడ్డీ వస్తుంది. అయితే వడ్డీ ఆదాయం లోకేష్ పన్ను పరిధిలోకి వస్తుంది.
ఈ పన్ను బాదుడి నుంచి బయటపడాలంటే ఆ సొమ్మును బహుమతిగా కాకుండా వడ్డీ లేని రుణం ఇస్తే దానిపై వచ్చే ఆదాయం భర్త పరిధిలోకి రాదు. పెట్టుబడిపై వచ్చే ఆదాయం భార్య పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంలో భాగంగా పరిగణిస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని క్లబ్బింగ్ నియమాన్ని సమర్థవంతంగా దాటవేస్తూ తన ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఆదాయాన్ని ప్రకటించడానికి ఆమెను అనుమతిస్తుంది. భార్య డబ్బును వెంచర్‌లో లేదా వారి పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తే ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బహుమతికి బదులుగా డబ్బు బదిలీని రుణంగా రూపొందించడం ద్వారా భార్యాభర్తల చట్టబద్ధంగా ఆదాయాన్ని కలుపుకోకుండా నివారించవచ్చు.
కుటుంబ సభ్యుల మధ్య బహుమతులు పన్ను రహితంగా ఉండవచ్చు. ఆ బహుమతులను పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే ఆదాయం క్లబ్బింగ్ నియమానికి లోబడి ఉంటుంది. పన్నులను చట్టబద్ధంగా ఆదా చేయడానికి బహుమతికి బదులుగా వడ్డీ రహిత రుణాన్ని అందించడాన్ని పరిగణించాలి. తద్వారా పెట్టుబడి ఆదాయాన్ని ఇచ్చేవారి పన్ను విధించదగిన ఆదాయం నుంచి వేరుగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..