Insurance: కేవలం రూ.20 డిపాజిట్‌తో రూ.2 లక్షల బీమా సౌకర్యం.. ఈ కేంద్ర పథకం గురించి మీకు తెలుసా?

Insurance: ఆరోగ్య పాలసీ లేదా వైద్య నిధిని పొందలేని వారికి సంవత్సరానికి రూ.20 బీమా కవర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన వారు లేదా అసంఘటిత రంగంలో పనిచేసే వారు ఈ పథకం ద్వారా తమను తాము, వారి కుటుంబాలను రక్షించుకోవచ్చు..

Insurance: కేవలం రూ.20 డిపాజిట్‌తో రూ.2 లక్షల బీమా సౌకర్యం.. ఈ కేంద్ర పథకం గురించి మీకు తెలుసా?

Updated on: Jul 08, 2025 | 2:00 PM

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చుల మధ్య ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొవడం అందరికి సాధ్యం కాకపోవచ్చు. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తిన సమయంలో వైద్య ఖర్చులను భరించడం సవాలుతో కూడుకున్నది. రూ. 20 చిన్న పెట్టుబడి మీకు రూ. 2 లక్షల బీమా రక్షణను అందిస్తుంది. ప్రభుత్వం అటువంటి పథకాన్ని తీసుకువచ్చింది. అదే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY). దీనిలో మీరు కేవలం రూ. 20 వార్షిక ప్రీమియం చెల్లించడం ద్వారా రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా రక్షణ పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Viral Video: ఇది చూస్తే వణుకు పుట్టాల్సిందే.. భయానక వీడియో వైరల్‌

ప్రభుత్వ పథకాన్ని ఎవరు సద్వినియోగం చేసుకోవచ్చు?

మీ వయస్సు 18 -70 సంవత్సరాల మధ్య ఉంటే, మీకు ఏదైనా బ్యాంకులో పొదుపు ఖాతా ఉంటే మీరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ పథకం కింద బీమా కవర్ ప్రతి సంవత్సరం పునరుద్ధరిస్తూ ఉండాలి. ఈ పథకం రూ. 20లు మీ బ్యాంక్ ఖాతాతో లింక్ చేసి ఉంటే ప్రతి సంవత్సరం అటోమెటిక్‌గా డెబిట్‌ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇందులో ఏం కవర్‌ అవుతాయి?

ఈ బీమా పథకం ప్రమాదవశాత్తు జరిగిన కేసులపై మాత్రమే దృష్టి పెడుతుంది. ఒక వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే లేదా పూర్తిగా వికలాంగులైతే అతనికి లేదా అతని కుటుంబానికి రూ. 2 లక్షల వరకు బీమా కవరేజ్ లభిస్తుంది. మరోవైపు ఆ వ్యక్తి పాక్షికంగా వికలాంగులైతే అతనికి రూ. 1 లక్ష వరకు క్లెయిమ్ అందిస్తుంది. అయితే ఈ పథకం సహజ మరణం లేదా అనారోగ్యం సందర్భాలలో ప్రయోజనాలను అందించదు.

ఇది కూడా చదవండి: Minimum Balance: కస్టమర్లకు పండగలాంటి వార్త చెప్పిన మరో బ్యాంకు.. మినిమమ్‌ బ్యాలెన్స్‌ రూల్స్‌ రద్దు

ఎలా దరఖాస్తు చేయాలి?

ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి ముందుగా మీరు మీ బ్యాంకు శాఖను సంప్రదించాలి. PMSBY ఆ బ్యాంకులో పొదుపు ఖాతా ఉన్న ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందుకే మీరు ముందుగా మీ బ్యాంకు శాఖకు వెళ్లాలి. అక్కడ మీకు పథకానికి సంబంధించిన ఫారమ్ లభిస్తుంది. దానిని పూరించి పత్రాలతో పాటు బ్యాంకులో సమర్పించండి.

ఈ ప్రణాళిక ఎందుకు అవసరం?

ఆరోగ్య పాలసీ లేదా వైద్య నిధిని పొందలేని వారికి సంవత్సరానికి రూ.20 బీమా కవర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన వారు లేదా అసంఘటిత రంగంలో పనిచేసే వారు ఈ పథకం ద్వారా తమను తాము, వారి కుటుంబాలను రక్షించుకోవచ్చు.

ఇది కూడా చదవండి: White Bedsheets: పెద్ద కథే.. హోటళ్లలో తెల్లటి బెడ్‌షీట్లనే ఎందుకు వేస్తారో తెలుసా? కారణం ఇదే!

ఇది కూడా చదవండి  Gold Price: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. కొన్ని గంటల్లోనే భారీగా పెరిగిన బంగారం ధరలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి