Central Government: రైతుల కోసం కేంద్రం అదిరిపోయే స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి డబ్బులు.. అప్లై చేసుకుంటే చాలు..

కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ పథకాన్ని రైతుల కోసం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రైతులు ఆదాయం పొందవచ్చు. సెలార్ పంపుసెట్లను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి విద్యుత్‌ను విక్రయించవచ్చు. డిస్కంలు ఈ విద్యుత్‌ను కొనుగోలు చేస్తాయి. ఈ పథకం కింద రైతులు ఎలా లబ్ది పొందాలంటే..

Central Government: రైతుల కోసం కేంద్రం అదిరిపోయే స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి డబ్బులు.. అప్లై చేసుకుంటే చాలు..
Farmers

Updated on: Feb 27, 2026 | 9:45 PM

రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. వివిధ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీ చేయడంతో పాటు ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలపై సబ్సిడీ అందిస్తున్నాయి. అలాగే తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు అందించేలా ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా 5 ఎకరాల్లోపు పోలం ఉన్న రైతులకు ప్రతీ ఏడాది రూ.6 వేల సాయం అందిస్తోంది. హోలీ సందర్భంగా 22వ విడతకు సంబంధించి రూ.2 వేల నగదు రైతుల అకౌంట్లో కేంద్రం జమ చేయనుందని తెలుస్తోంది. అయితే రైతుల కోసం కేంద్రం మరో కూడా అమలు చేస్తోంది. అదే పీఎం కుసుమ్. అసలు ఈ పథకం బెనిఫిట్స్ ఏంటి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? అనే విషయాలు తెలుసుకుందాం.

60 శాతం వరకు సబ్సిడీ

పీఎం కుసుం పథకం ద్వారా సోలార్ పెంపుసెట్లపై రైతులకు 60 శాతం కేంద్రం సబ్సిడీ అందిస్తోంది. ఇక 30 శాతం బ్యాంకు నుంచి లోన్ ఇప్పిస్తోంది. ఇక మిగతా 10 శాతం సొమ్మును రైతులు చెల్లించి సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పంపుసెట్ల ద్వారా మిగులు విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించి రైతులు లక్షల్లో ఆదాయం పొందవచ్చు. పంట సాగుకు ఉపయోగపడటమే కాకుండా రైతులు వీటి ద్వారా ఏళ్ల పాటు ఆదాయం పొందవచ్చు. 2026 మార్చి నాటికి 34,800 మెగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

అర్హతలు..?

-రైతులు
-రైతు సంఘాలు
-సహకార సంఘాలు
-నీటి వినియోగదారుల సంఘాలు
-గ్రామ పంచాయతీలు

దరఖాస్తు ఎలా అంటే..?

-పీఎం కుసుమ్ అధికారిక వెబ్ సైట్‌కు వెళ్లండి
-రిజిస్ట్రేషన్ ఫారంపై క్లిక్ చేయండి
-అన్ని వివరాలను పూర్తి చేయండి
-డిక్లరేషన్ బాక్స్‌ను క్లిక్ చేయండి
-సబ్‌మిట్‌పై క్లిక్ చేయండి
-ఆ తర్వాత లాగిన్‌పై క్లిక్ చేయండి
-అప్లికేషన్ పూర్తి చేసి డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయండి

ఈ డాక్యుమెంట్స్ అవసరం

ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్ బుక్, మొబైల్ నెంబర్, పాస్ పోర్ట్ సైజు ఫొటో, డిక్లరేషన్ ఫామ్, బ్యాంక్ పాస్ బుక్, ల్యాండ్ డాక్యుమెంట్

ఆదాయం లక్షల్లోనే

ఉదాహరణకు ఒక మెగావాట్ కెపాసిటీ సోలార్ ప్లాంట్ రైతులు ఏర్పాటు చేసుకుంటే..  దాని నుంచి రోజుకు దాదాపు 4,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్‌ను రాష్ట్రంలోని డిస్కమ్‌లు 25 ఏళ్ల పాటు కొనుగోలు చేస్తాయి. ఇందుకు ముందుగానే రైతులతో డిస్కంలు ఒప్పందం చేసుకుంటాయి. ఒక యూనిట్‌కు రూ. 3.13 చొప్పున రైతులు పొందవ్చచు. అంటే రోజుకు రూ.14 వేల వరకు ఆదాయం పొందవచ్చు. ఇలా 25 ఏళ్ల పాటు అంటే లక్షల్లో ఆదాయం వస్తుంది.

Follow Us