PM Jan Dhan Yojana: పీఎం జన్‌ధన్‌ యోజన ఖాతాదారులకు రూ.10 వేల ఓవర్ డ్రాఫ్ట్.. ఇది ఎలా పని చేస్తుంది..?

|

Aug 29, 2021 | 8:31 PM

PM Jan Dhan Yojana: మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన (పీఎంజేడీవై) పథకానికి ఆగస్టు 28తో ఏడు సంవత్సరాలు..

PM Jan Dhan Yojana: పీఎం జన్‌ధన్‌ యోజన ఖాతాదారులకు రూ.10 వేల ఓవర్ డ్రాఫ్ట్.. ఇది ఎలా పని చేస్తుంది..?
Follow us on

PM Jan Dhan Yojana: మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన (పీఎంజేడీవై) పథకానికి ఆగస్టు 28తో ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆగస్టు 18, 2021 నాటికి ఈ పథకం కింద 43 కోట్ల 04 లక్షలపైగా ఖాతాలను తెరిచినట్లు తెలిపింది. ఈ పథకం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక చేయుత కార్యక్రమాలలో ఒకటి అని కేంద్ర సర్కార్‌ వెల్లడించింది. ఈ స్కీమ్‌ వల్ల దేశంలోని పేద, అణగారిన వర్గాలకు చెందిన వారు కోట్లాది మంది ఈ పథకం కింద జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలను ఓపెన్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఓపెన్ చేసిన ఖాతాల డిపాజిట్ల విలువ మొత్తం రూ.1.46 లక్షల కోట్లున్నట్లు కేంద్రం ఆర్థిక శాఖ వెల్లడించింది.

రూ.10 వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్:

కాగా, దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలకు చెందిన వారు జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకుల్లో అకౌంట్లను తెరవడానికి ఉద్దేశించినదే ఈ ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పథకం. ఈ స్కీమ్‌ కింద అకౌంట్‌ ఓపెన్ చేసిన వారికి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా లభిస్తుంది.

ఓవర్ డ్రాఫ్ట్ అంటే..

ఖాతాదారుని ఖాతాలో బ్యాలెన్స్ లేనప్పటికీ బ్యాంకు ఖాతా నుంచి(పొదుపు లేదా కరెంట్) నిర్ణీత మొత్తం వరకు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇతర క్రెడిట్ సదుపాయాల వలే, ఖాతాదారుడు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ద్వారా నగదు విత్ డ్రా చేసినప్పుడు కొంత వడ్డీ కట్టాల్సి ఉంటుంది. స్వల్పకాలిక రుణం రూపంలో జన్ ధన్ ఖాతాదారులు రూ.10వేల వరకు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ పరిమితి ఇంతకు ముందు రూ.5 వేల వరకు ఉండేది. కానీ ప్రభుత్వం గత ఏడాది ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది.

ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఏవిధంగా పనిచేస్తుంది..?

ఈ స్కీమ్‌ కింద ఖాతాలు ఓపెన్‌ చేసిన ఖాతాదారులు తమ ఖాతాల్లో ఉన్న దానికంటే ఎక్కువ డబ్బును అప్పు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే పీఎంజేడీవై ఖాతా యజమాని కనీసం ఆరు నెలల పాటు దానిని ఆపరేట్ చేసి ఉండాలి. అదే విధంగా, ఒక నిర్ధిష్ట కుటుంబంలోని ఒక సభ్యుడు మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందవచ్చు. సాధారణంగా మహిళా సభ్యులకు అవకాశం ఉంటుంది. అంతేకాదు ఖాతాదారునికి మంచి క్రెడిట్ చరిత్ర ఉండాలి. పీఎంజేడీవై ఓవర్ డ్రాఫ్ట్ కింద రూ.2 వేల వరకు ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు. ఓవర్ డ్రాఫ్ట్ గరిష్ట వయోపరిమితిని కూడా ప్రభుత్వం 60 నుండి 65 సంవత్సరాలకు పెంచింది.

ఇవీ కూడా చదవండి:

Jan Dhan Yojana: జన్‌ ధన్‌ యోజన పథకానికి ఏడేళ్లు పూర్తి.. ఎంత మంది లబ్ది పొందారో తెలుసా..?

Vivad se Vishwas Scheme: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు

Farmers: కేంద్ర సర్కార్‌ స్కీమ్‌.. రైతులు ఇలా చేయండి.. నెలకు రూ.3000 పొందవచ్చు.. పూర్తి వివరాలు..!